Power Cuts Again AP: మళ్లీ విద్యుత్ కోతలు..భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

Power Cuts Again AP: విద్యుత్ కోతలు మళ్లీ షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కష్టాలు తప్పడం లేదు దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవిలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరగడంతో సరైన స్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. ఫలితంగా అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజల బాధలు వర్ణనాతీతం. ఉక్కపోత.. కరెంటు కోత వెరసి ప్రజల వెతలు. రాష్ట్రంలో కరెంు కష్టాలతో ఎండాకాలం అల్లాడుతున్నారు. ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో అటు పరిశ్రమలు, ఇటు పనులు […]

Written By: Srinivas, Updated On : May 27, 2022 10:12 am
Follow us on

Power Cuts Again AP: విద్యుత్ కోతలు మళ్లీ షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కష్టాలు తప్పడం లేదు దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవిలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరగడంతో సరైన స్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. ఫలితంగా అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజల బాధలు వర్ణనాతీతం. ఉక్కపోత.. కరెంటు కోత వెరసి ప్రజల వెతలు. రాష్ట్రంలో కరెంు కష్టాలతో ఎండాకాలం అల్లాడుతున్నారు. ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో అటు పరిశ్రమలు, ఇటు పనులు సాగడం లేదు. అయినా ప్రభుత్వం ఎంత తీసుకుంటున్నా వినియోగం పెరగడంతో ఏం చేయలేని పరిస్థితి.

Power Cuts Again AP

వేసవిలో కరెంటు వినియోగం పెరుగుతుందని తెలిసినా దానికగనుణంగా చర్యలు తీసుకోవాల్సిన పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ కోతలపై ప్రభుత్వం ఏం చెప్పినా నమ్మే స్థితిలో ప్రజలు లేరు. గతంలోనే మంత్రులు మేలో కోతలుండవని చెప్పినా ఇప్పుడే అసలైన కోతలు విధిస్తున్నారు. చెప్పాపెట్టకుండా కరెంటు తీసేస్తున్నారు. దీంతో ప్రజలు మాత్రం తమ కష్టాలు ఎవరితో చెప్పుకోవాలని మథనడుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Dil Raju: F3లో పవన్ కళ్యాణ్.. ఇదీ అసలు కిక్కంటే.. ఇక రచ్చ రచ్చే

విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది. రోజుకు 200 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరం అవుతోంది. దీంతో జల విద్యుత్, పవన విద్యుత్, సౌర విద్యుత్, థర్మల్ విద్యుత్ అన్నింట్లోనుంచి తీసుకుంటున్నా సరిపోవడం లేదు. దీంతో అప్రకటిత కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై పాలకులు ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం వినడం లేదు. కానీ ఇంకా వారం రోజులు కోతలు విధించే సూచనలు కనిపిస్తున్నాయి.

Power Cuts Again AP

ఈసారి కూడా రుతుపవనాలు ముందే వస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఇక వర్షాలు వస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. లేదంటే ఈ కోతలు విధించాల్సి ఉంటుంది. దీంతో జనం మాత్రం నిద్ర పోవడం లేదు. నిరాటంకంగా విద్యుత్ కోతలు అమలు చేస్తుండటంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. పాలకులు, అధికారులు మందస్తు చూపుతో వ్యవహరించి విద్యుత్ కోతలు లేకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన మేర విద్యుత్ ను అందుబాటులో ఉంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెబుతున్నారు.

Also Read:Rahul Gandhi: మరో పెద్ద వివాదంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ

Tags