AP Power Bills: కరెంట్ కట్ కటా: ఏపీలో ప్రజలు ఏసీలు, వాషింగ్ మిషన్లు వాడొద్దని ఆదేశం..

AP Power Bills: కరెంటు కోతలు ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వమే ప్రజలను విద్యుత్ ఆదా చేయాలని కోరుతోంది. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు ఏనాడో మొదలయ్యాయి. విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అందుకనుగణంగా కరెంటు ఉత్పత్తి జరగడం లేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ కోతలు విధిస్తూ నెట్టుకొస్తోంది ప్రభుత్వం. అయినా విద్యుత్ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్రంలో కరెంటు వినియోగం పెరగడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ప్రభుత్వం మరో విన్నపం […]

Written By: Srinivas, Updated On : April 2, 2022 1:05 pm
Follow us on

AP Power Bills: కరెంటు కోతలు ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వమే ప్రజలను విద్యుత్ ఆదా చేయాలని కోరుతోంది. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు ఏనాడో మొదలయ్యాయి. విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అందుకనుగణంగా కరెంటు ఉత్పత్తి జరగడం లేదు. ఈ నేపథ్యంలో విద్యుత్ కోతలు విధిస్తూ నెట్టుకొస్తోంది ప్రభుత్వం. అయినా విద్యుత్ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. రాష్ట్రంలో కరెంటు వినియోగం పెరగడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

AP Power Bills

ప్రభుత్వం మరో విన్నపం చేస్తోంది. ప్రజలు ఏసీలు, కూలర్లు వాడొద్దని సూచిస్తోంది. దీంతో కరెంటు వినియోగం మరింత పెరిగి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీ కూడా విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక వైపు కేంద్రం ధరలు పెంచుతూ ఇటు రాష్ట్రాలు కూడా పెంచడంతో ఇక ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.

ఈమేరకు ఎస్పీడీసీఎల్ పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్ ను తగ్గించాలని కోరుతోంది. ఈ మేరకు సీఎండీ హరినాథ్ రావు ప్రజలు నియంత్రణ పాటించి విద్యుత్ ను ఆదా చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే అధికారిక కోతలు ప్రారంభించడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

AP Power Bills

బీజేపీ, జనసేన, టీడీపీలు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ప్రజలకు అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు పంచుతూ నిరసన వ్యక్తం చేశారు. సామాన్యులపై భారం మోపొద్దని వేడుకుంటున్నారు. విపక్షాల నిరసనలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. విద్యుత్ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబే అని కౌంటర్ ఇచ్చారు. దీంతో రాజకీయాలు విద్యుత్ చార్జీల చుట్టూ తిరుగుతున్నాయని తెలుస్తోంది.

Tags