Poverty: ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత దేశం ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి అభివృద్ధి చెందుతున్న కూడా ఇప్పటికీ దేశంలో పేదరికం ఉంది. కాలాలు మారుతున్న, అన్ని నిత్యావసరాలు లభ్యమవుతున్న, ఇంత టెక్నాలజీలో ఉన్నా కూడా ఇప్పటికీ కొన్ని పట్టణాలు పేదరికంలోనే ఉంటున్నాయి. దేశంలో ఉన్న పేదరికాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. కానీ దేశంలో చాలామంది పేదరికంలోనే జీవిస్తున్నారు. వీరికి కష్టపడితేనే తిండి. లేకపోతే లేదు. అయిన ఈ రోజుల్లో చాలా మంది కష్టపడి సంపాదిస్తున్నారు. అయినప్పటికీ దేశంలో కొన్ని నగరాలు మాత్రం పేదరికంలో ఉండిపోయాయి. ఇంత మోడ్రన్ టెక్నాలజీలో కూడా ఇప్పటికీ పేదరికంలోనే ఉన్న ఆ పట్టణాలేంటో మరి ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
అలీరాజ్‌పూర్
అలీరాజ్‌పూర్ మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ 76.5 శాతం కంటే ఎక్కువ మంది జనాభా దారిద్ర్యరేఖకు దిగువగానే జీవిస్తున్నారు. ఇండియాలోనే అత్యంత పేద పట్టణం ఈ అలీరాజ్‌పూర్. ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇప్పటికీ ఈ పట్టణం పేదరికంలోనే ఉంది. పేదరికంలో అలీరాజ్‌పూర్ మొదటి స్థానంలో ఉంది.
నబరంగ్
ఇక పెదరికంలో నవరంగ్ పట్టణం రెండో స్థానంలో ఉంది. ఒడిశాలోని నవరంగ్ పట్టణంలో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండే ఆ పట్టణం ఇప్పటికీ పేదరికంలోనే ఉంది. కొండ ప్రాంతంలో ఉండటం వల్ల వీరికి అవకాశాలు పెద్దగా తెలియవు. నిజం చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు తిండి, బట్టకు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు.
మల్కన్‌గిరి
ఈ పట్టణం కూడా ఒడిశాలోనే ఉంది. దీన్ని మాలిక్‌మర్దనగిరి అని పిలుస్తారు. ఇది పేదరికంలో మూడో స్థానంలో ఉంది. అయితే ఈ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండరు. కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే జీవిస్తున్నాయి. నక్సలైట్ ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ఉండే ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం వల్ల వీరు పేదరింలోనే జీవిస్తున్నారు. వీరికి నిత్యావసర సరుకులు అన్ని దొరకడం కష్టమే.
కోరాపుట్
ఒడిశాలో ఉన్న కోరాపుట్ దేశంలోని పేదరికంలో ఉన్న పట్టణాల్లో నాలుగోది. ఇక్కడ ఉండే ప్రజలు చాలా మంది పేదరికంలోనే జీవిస్తున్నారు. ఈ పట్టణం సముద్ర మట్టానికి 870 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ కూడా ఎక్కువగా గిరిజనులు ఉంటారు. ఈ ప్రాంతంలో చాలా మంది పేదరికంలోనే బతుకుతున్నారు.
నువాపా
ఒడిశా రాష్ట్రంలో ఉన్న నువాపాలోని ప్రజలు కూడా పేదరికంలోనే జీవిస్తున్నారు. దేశంలో పేదరికంలో ఉన్న పట్టణాల్లో ఈ నువాపా ఐదో స్థానంలో ఉంది. ఇక్కడ ఆర్థికంగా బలాన్నిచ్చే ఎలాంటి పరిశ్రమలు లేవు. వీటివల్ల చాలా మంది ఆకలితో ఇబ్బంది పడుతున్నారు.