Hit 3 : వరుసగా మూడు హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన ‘హిట్ 3′(Hit : The Third Case) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లతో ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 150 కోట్ల మార్కుని కూడా అందుకోనుంది. ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోలు వంద కోట్ల గ్రాస్ సినిమాని అందుకోవడమే పెద్ద విజయం గా భావిస్తున్న ఈ రోజుల్లో, నాని ఏకంగా మూడు సార్లు వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో నాని విలన్స్ ని ఎంత దారుణంగా చంపుతాడో మనమంతా చూసాము. అలా సెకండ్ హాఫ్ లో ఒక లేడీ విలన్ తో ఫైట్ చేసి ఆమెని చంపే సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉంటుంది.
Also Read : నాని ‘హిట్ 3’ ఈవెంట్ లో పవన కళ్యాణ్ డైలాగ్ వాడటం వెనక అసలు కారణం ఇదేనా..?
ఆ అమ్మాయికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈమె పేరు నిధి సింగ్(Nidhi Singh). ముంబై కి చెందిన ఈ అమ్మాయి మోడలింగ్ రంగం లో రాణించి, ఆ తర్వాత ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించి, పలు సినిమాల్లో అవకాశాలను కూడా సంపాదించింది. ఈమె డైరెక్టర్ శైలేష్ దృష్టిలో పడడంతో వెంటనే ఆమెని ‘హిట్ 3’ చిత్రం లోకి తీసుకున్నాడు. చిన్న క్యారక్టర్ అయినప్పటికీ కూడా ఈమె ఆడియన్స్ దృష్టిలో పడింది. ఎవరో ఈ అమ్మాయి చూసేందుకు చాలా క్యూట్ గా ఉంది, ఈమె వివరాలు తెలుసుకోవాలని నెటిజెన్స్ గూగుల్ లో వెతకగా ఈమె పేరు నిధి సింగ్ అని తేలింది. ఆమెకు సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా కనిపించింది.
ఆ ప్రొఫైల్ ని లక్షల సంఖ్యలో అభిమానులు ఫాలో అవుతున్నారు. చేసింది చిన్న క్యారక్టర్ అయినప్పటికీ, ఆమె మీద పలు మీమ్స్ రావడాన్ని చూసి ఎంతో సంతోషించిన నిధి సింగ్, నాపై అభిమానం చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. చూసేందుకు అచ్చం హీరోయిన్ లాగా ఉన్నవని, భవిష్యత్తులో నిన్ను మేము హీరోయిన్ రోల్స్ లో చూస్తామని నెటిజెన్స్ ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ క్రింద కామెంట్స్ చేస్తున్నారు. ‘హిట్ 3’ తర్వాత కచ్చితంగా ఆమెకు మన తెలుగు లో అవకాశాలు వస్తాయని అనుకోవచ్చు. ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ అవి ఆమె హీరోయిన్ గా చేస్తుందా లేకపోతే వేరే ఏదైనా క్యారక్టర్ చేస్తుందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read : హిట్ 3 కోసం రాజమౌళి మూవీని తాకట్టు పెట్టిన నాని… మహేష్ బాబు కోపానికి వస్తున్నాడా.?
