Vijay CM seat news: అందరిని ద్రాక్షపుల్లన అనే పాఠాన్ని చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా.. ఇప్పుడు టీవీకే అధినేత విజయ్ నిత్యం చదివాలేమో. ఎందుకంటే తమిళనాడులో పరిస్థితులు అలా మారిపోతున్నాయి మరి. ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నిన్న సాయంత్రం తమిళనాడు రాజకీయాలలో పరిణామాలు వేరే విధంగా మారిపోయాయి. టీవీకే అధినేత విజయ్ కి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, విసికె, ఐయూఎంఎల్ మద్దతు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. వారు మద్దతు ఇచ్చిన లేఖలను కూడా విజయ్ గవర్నర్ ముందు ఉంచినట్టు ప్రచారం జరిగింది. దీంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. చెన్నైలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని.. విజయ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారని.. కాన్వాయ్ కూడా ఏర్పాటు చేశారని వార్తలు వచ్చాయి.
రాత్రిలోగా పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు మినహా.. మిగతా పార్టీలు విజయ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. ఐయూఎంఎల్ మద్దతును ఉపసంహరించుకుంది. విసికె లేఖ ఇవ్వలేదు.. దీనిపై కూడా రాద్ధాంతం జరిగింది. ఫలితంగా విజయ్ ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. దీంతో విజయ్ అనే నేను అనే మాట పలకకుండా ఆ పార్టీలు టీవీకే అధినేతకు బ్రేక్ వేస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుంది.. అనే ప్రశ్నను పక్కనపెడితే తమిళనాడులో రాజకీయాలు త్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు ముగిసిపోతాయి.. విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఇప్పుడు అంతు పట్టకుండా ఉంది.
విజయ్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ మహాబలిపురంలోని రిసార్ట్ లో ఉంటున్నారు. కాంగ్రెస్ నేతలు అల్టిమేట్ గా సపోర్ట్ ఇచ్చారు. కమ్యూనిస్టులు కూడా ప్రభుత్వానికి బయటికి సపోర్ట్ ఇస్తామని.. తమకు మంత్రి పదవులు అవసరం లేదని చెప్పేశారు. కానీ ఇంతలోనే ఐయూఎంఎల్ మద్దతును ఉపసంహరించుకుంది. విసికె లేఖ ఇవ్వలేదు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.. ప్రమాణస్వీకారం లేకపోవడంతో టీవీకే కార్యకర్తలు గందరగోళం లో పడిపోయారు.. విజయ్ లో కూడా నైరాశ్యం పెరిగిపోతుంది..
ఈ పరిణమాలతో టీవీకే కార్యకర్తలు రకరకాల చర్చలు జరుపుతున్నారు. అసలు విజయ్ ముఖ్య మంత్రి అవుతారా.. ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీలు ఊరుకుంటాయా.. ఇప్పటికే డిఎంకె, అన్నా డీఎంకే నేతలు కలిసిపోయారని అనుకుంటున్నారు. అలాంటప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయితే ఆ పార్టీలు ఉద్యమాన్ని మొదలుపెడతాయి. అప్పుడు విజయ్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని టీవీకే కార్యకర్తలు చర్చించుకుంటున్నారు..