https://oktelugu.com/

ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ షురూ…

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. కేరళ, తమిళనాడు, రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి మంగళవారం (ఏప్రిల్ 6)న పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇక్కడ ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక అస్సోంలో చివరిదైన మూడో విడత, బెంగాల్లో మూడో విడతకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా మంగళవారం ఒక్కరోజే 475 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం ఏడు గంటలకే షురూ అయ్యింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు, కేరళలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 6, 2021 / 11:07 AM IST
    Follow us on


    దేశంలోని ఐదు రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. కేరళ, తమిళనాడు, రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి మంగళవారం (ఏప్రిల్ 6)న పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇక్కడ ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక అస్సోంలో చివరిదైన మూడో విడత, బెంగాల్లో మూడో విడతకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా మంగళవారం ఒక్కరోజే 475 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం ఏడు గంటలకే షురూ అయ్యింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు, కేరళలో 140, అస్సోంలో 30, పశ్చిమ బెంగాల్ లో 31, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు మలప్పురం, కన్యాకుమారి లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ.. ఓటర్లు క్యూలో నిల్చుని ఓట్లు వేస్తున్నారు.

    తమిళనాడులో మొత్తం 6.2 కోట్ల ఓటర్లున్నారు. ఇందులో 3.18 కోట్ల మంది మహిళా ఓటర్లు, 3.8 కోట్ల మంది పురుష ఓటర్లు, 7200 మంది ట్రాన్స్ జెండర్లున్నారు. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 3998 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 88,937 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ, యూపీఏ కూటముల మధ్యే ప్రధాన పోరు కనిపిస్తోంది. కమల్ హాసన్ ఆధ్వర్యంలోని ఎంఎన్ఎం, ఐజేకే, ఏఐఎస్ఎంకే, నామ్ తమిళర్ కట్టి పార్టీలు మరో కూటమిగా పని చేస్తున్నాయి.ఇక టీటీవీ దినకరణ్ కు చెందిన ఏఎంఎంకే, ఎంఐఎంతో పటు మరికొన్ని చిన్న పార్టీల కూటమతో పోటీ చేస్తున్నాయి.

    ఇక కేరళా రాష్ట్రంలో మొత్తం 2.74 కోట్ల ఓటర్లు న్నారు. వీరిలో పురుషులు 1.32, మహిళలు 1.41 కోట్లు ఉన్నారు. 140 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 957 మంది బరిలో ఉన్నారు. ఈ సారి కూడా సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది. ఇటీవల ప్రభుత్వం కూలిపోయిన పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ డెమోక్రాటిక్ అలయన్స్, ఎన్డీఏ నేతృత్వంలోని ఆలిండిమా ఎన్ఆర్ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఉదయం 8గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ ఆరు గంటల వరకు సాగుతుంది.

    అసోంలో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి విడత ప్రారంభం అయ్యింది. 40 స్థానాలకు పోటీ జరుగుతోంది. 337 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 79,19,641 మంది ఓటుహక్కను వినియోగించుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరుగుతుండగా.. నేడు మూడో విడత పోలింగ్. 31 స్థానాలకు ప్రక్రియ ప్రారంభం అవ్వగా.. మొత్తం 205 మంది అభ్యర్థులు పోటీ లో ఉన్నారు. మిత్తం 10,817 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 78.5 లక్షల మంది తమ ఓటుహక్కను వినియోగించుకుంటున్నారు.