AP Politics- MP Gorantla Madhav: ఏపీకి లెక్కలేనన్ని సమస్యలున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. రైల్వేజోన్ కు అతీగతీ లేదు. రాజధాని లేకుండా నడిరోడ్డుపై ఉన్నాం. పోలవరంలో పురోగతి లేదు. విభజన హామీలు అమలుకావడం లేదు. జాతీయ ప్రాజెక్టుల జాడ లేదు. పరిశ్రమల ఏర్పాటు లేదు. రహదారులు బాగాలేవు. సంక్షేమ పథకాలు అందక వేలాది మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కనీస మౌలిక వసతులు లేవు. ఇవన్నీ పట్టిపీడిస్తున్న సమస్యలే. పరిష్కరమార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా..ప్రభుత్వం మెడలు వంచి పనులు చేయించాల్సిన బాధ్యత విపక్షం పై ఉంది. కానీ ఇవన్నీ తోసిరాజని ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షం ఒక జుగుప్సాకరమైన అంశం చుట్టూ తిరుగుతుండడం మాత్రం అసహ్యమేస్తోంది. డర్డీ పిక్చర్ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపైనే అధికార, విపక్షాలు దృష్టిసారించడం మాత్రం ఆందోళన, ఏవగింపు కలిగిస్తోంది. ఇదో ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తోంది. అదే సమయంలో ఎంపీ మాధవ్ ను కాపాడేందుకు ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ వినియోగిస్తోంది.

ఆది నుంచి అంతే..
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యక్తిత్వం విచిత్రం. ఆయన కారెక్టర్ వివాదాస్పదం. ఆయన కుటుంబంతో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. కానీ పోలీస్ అధికారిగా, ఎంపీగా ఆయన వ్యవహార శైలి మాత్రం అందరికీ సుపరిచితం. పోలీస్ గా దూకుడుగా ఉన్న ఆయన్ను ఏరికోరి మరీ వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఎంపీగా ఆయన తన తొలి ప్రసంగమే వివాదాస్పదం. అప్పుడే ప్రారంభమైంది ఆయన విశ్వరూపం. మాట్లాడే ప్రతీ మాట అభ్యంతరకరంగా ఉంటుంది. పలుమార్లు మాట్లాడి ఏపీ పరువును అమాంతం దిగజార్చారు. సొంత పార్టీ రెబల్ ఎంపీని పార్లమెంట్ ప్రాంగణంలో బండ బూతులు తిట్టారు. చంపేస్తానని హెచ్చరించారు. ఆయన వ్యవహార శైలి పార్లమెంట్లోనే చర్చనీయాంశంగా మారింది.అటు పారిశ్రామికవేత్తలతోనే ఆయన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కానీ అటు అధిష్టానం కంట్రోల్ చేసిన పాపాన పోలేదు. దీంతో ఆయన ఆన్ లైన్ శృంగార వ్యవహారం బయటపడింది. యావత్ ప్రపంచం చూసింది. వాస్తవానికి ఆ వీడియో బయటకు రావడమే ఆయనకు పెద్ద శిక్ష. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పరువు అమాంతం దిగజారిపోయింది. అది నా వ్యక్తిగతం. నా మనసుకు నచ్చింది కాబట్టి చేశాను అని మాధవ్ అని ఉంటే అక్కడితో ఫుల్ స్టాప్ పడేది. కథ సుఖాంతమయ్యేది. ఆన్ లైన్ శృంగారంలో కనిపిస్తున్న మహిళ ఇష్టపూర్వకంగానే పాలుపంచుకొని ఉండొచ్చు. లేకుంటే ఆమె తెరపైకి వచ్చేది. కేసులు పెట్టి ఉండేది. కానీ అవేవీ జరగలేదు. కానీ అతడితో వ్యవహారం చెడి వీడియో బయటపెట్టి ఉండవచ్చు. అందాక తెచ్చుకోవడం ఎంపీ వైఫల్యమేననే చెప్పొచ్చు. అయితే డర్టీ పిక్చర్ విషయంలో ఎటువంటి ఫిర్యాదులు లేవు. బాధితులు లేరు. అలాగని చట్టంలోని ఏ సెక్షన్లూ గోరంట్ల మాధవ్ ది నేరమని చెప్పలేదు. అయితే ఆయన నైతిక ప్రవర్తన విషయంలో మాత్రం ఇది మాయని మచ్చ.
Also Read: MP Gorantla Madhav Issue: ఏపీలో ‘న్యూడ్’ మంటలు..డర్డీ పిక్చర్ పై ఎంపీని కాపాడడానికి తంటాలు
అతిగా స్పందించిన టీడీపీ
అయితే ఈ ఎపిసోడ్ లో విపక్షం తెలుగుదేశం అతిగా స్పందించడం విమర్శలపాలవుతోంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి అదే పనిగా ఇదే అంశాన్ని హైలెట్ చేయడం మాత్రం దారుణంగా ఉంది. దీనిపై కొన్ని పక్షాలు తప్పుపడుతున్నాయి. ఎంపీ వీడియో సోషల్ మీడియాలో వచ్చిన తరువాత దానిని అలాగే వదిలేసి ఉంటే సరిపోయేది. ఎంపీతో పాటు ప్రభుత్వం అబాసుపాలై ఉండేది. దాన్ని అనుకూల మీడియాలో బూతద్దంలో పెట్టి చూపారు. టీవీల్లో చర్చాగోష్టిలు పెట్టారు. ఒక వేళ ఈ వ్యవహారంలో బాధిత మహిళ బయటకు వచ్చి ఉండి కేసు పెట్టి ఉంటే మాత్రం విపక్షంగా స్పందించాల్సిన తప్పని పరిస్థితి. కానీ అక్కడ ఫిర్యాదుచేసేవారు లేరు..బాధితులు లేరు.. బాధించబడ్డవారెవరూ లేకున్నా టీడీపీ అతిగా స్పందించిందన్న అపవాదునైతే మూటగట్టుకుంది. లైట్ తీసుకుని ఉంటే ఈ వ్యవహారం అధికార పార్టీ కోర్టులో ఉండేది. ప్రజల్లో ఆ పార్టీ చులకనయ్యేది.

నైతికత అమలు అవకాశం వచ్చినా..
నైతికత అన్న మాటను వైసీపీ అధిష్టానం ఎప్పుడూ చెప్పుకొస్తోంది. కానీ ఎంపీ మాధవ్ వ్యవహారంలో అమలుచేసే అవకాశం వచ్చింది. కానీ ఎందుకో సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే కఠినాతి కఠినమైన చర్యలు ఉంటాయన్న రేంజ్ లో మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. అనుకూల మీడియా కూడా ఎంపీ మాధవ్ పై చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఎందుకో వెనక్కి తగ్గింది. చర్యలు మాట దేవుడెరుగు వెనుకేసుకు రావడం ప్రారంభించింది. ప్రజల్లో ప్రభుత్వం నవ్వులపాలైంది. ప్రజలు మరిచిపోతామన్నా మేము మరువనివ్వం అన్న రీతిలో కొత్తగా అది ఫేక్ వీడియో అని తేల్చడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందు కోసం వ్యవస్థలను వాడేస్తుండడం విస్తుగొల్పుతోంది. ప్రభుత్వ పెద్దలు రాసిచ్చిన స్క్రిప్టునే పోలీస్ అధికారులు చదివేస్తుండడం కూడా నివ్వెరపరుస్తోంది. వాస్తవానికి వీడియో బయటపెట్టిన వారు చాలా తెలివితేటలు ప్రదర్శించారు. ఒక ఫోన్ లో వీడియో ప్లే అవుతుండగా వీడియో తీసి మాత్రమే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తద్వారా తాము దొరకకుండా జాగ్రత్త పడడమే కాకుండా.. ఒరిజినల్ వీడియో తమ వద్ద ఉందన్న సంకేతాలను బలంగా పంపారు. పోలీస్ అధికారులకు ఇవి తెలియనివి కావు. కానీ రాజకీయ ఒత్తడితో ఫేక్ వీడియో అంటూ ప్రకటించేశారు. ఒక వేళ ఒరిజినల్ వీడియో మరింత క్లారిటీతో బయటపడితే మాత్రం తమ పరిస్థితి ఏమిటన్నది కూడా ఆలోచన చేయకపోవడం నిజంగా రిస్కు చేయడమేననిపిస్తోంది. మొన్నటికి మొన్న అనంతపురం ఎస్పీ పకీరప్ప కథ సుఖాంతం చేయడానికి ప్రయత్నించగా.. తాజాగా సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ తెరపైకి వచ్చారు. ఎంపీ మాధవ్ ను బయటపడే ప్రయత్నం చేశారు. అటు డర్డీ పిక్చర్ వ్యవహారంలో టీడీపీ అల్లరి చేస్తోందని భయపడ్డారో.. లేకుండా సొంత పార్టీ ఎంపీని కాపాడుకోవాలని ఆరాట పడ్డారో తెలియదు కానీ వైసీపీ నాయకులు సైతం తెలుగుదేశం పార్టీ ట్రాప్ లో పడ్డారన్న ప్రచారమైతే సాగుతోంది.
Also Read:Dolo 650: డోలో-650 సూచించాలని డాక్టర్లకు రూ.1000 కోట్ల ముడుపులు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

[…] […]