https://oktelugu.com/

Puri Jagannadh- Charmi: చార్మితో తన సంబంధాన్ని బయటపెట్టిన పూరి జగన్నాథ్.. ఆ విషయంలో పూరి నిజంగా గ్రేట్ !

Puri Jagannadh- Charmi: పూరి కనెక్ట్స్ నిర్మాణ భాగస్వాములుగా కొనసాగుతున్న పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనేది మిలియన్ డాలర్ ప్రశ్నగానే ఉంది. కలిసి సినిమాలు నిర్మిస్తూ, ఒకే ఇంటిలో నివసిస్తున్న వీరు సహజీవనం చేస్తున్నారనే వాదన చాలా కాలంగా వినిపిస్తోంది. దాదాపు పదేళ్లుగా పూరి, ఛార్మి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. పూరి ఎక్కడ ఉంటే ఛార్మి అక్కడ ఉంటుంది. కలిసి మందు కొడతారు. పార్టీలలో పాల్గొంటారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ […]

Written By:
  • Shiva
  • , Updated On : August 19, 2022 / 11:49 AM IST

    Puri Jagannadh, Charmi

    Follow us on

    Puri Jagannadh- Charmi: పూరి కనెక్ట్స్ నిర్మాణ భాగస్వాములుగా కొనసాగుతున్న పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటనేది మిలియన్ డాలర్ ప్రశ్నగానే ఉంది. కలిసి సినిమాలు నిర్మిస్తూ, ఒకే ఇంటిలో నివసిస్తున్న వీరు సహజీవనం చేస్తున్నారనే వాదన చాలా కాలంగా వినిపిస్తోంది. దాదాపు పదేళ్లుగా పూరి, ఛార్మి అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. పూరి ఎక్కడ ఉంటే ఛార్మి అక్కడ ఉంటుంది. కలిసి మందు కొడతారు. పార్టీలలో పాల్గొంటారు. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చేస్తారు. అందుకే, వీరి రిలేషన్ బహిరంగ రహస్యమే.

    Puri Jagannadh- Charmi

    పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బుడ్డా హోగా తేరా బాప్’, ‘జ్యోతిలక్ష్మి’ చిత్రాల్లో ఛార్మి నటించింది. ఇక నిర్మాతగా ఆయనతో కలిసి ఆరు చిత్రాలు చేసింది. మరో రెండు చిత్రాలు లైగర్ విడుదలకు సిద్ధం కాగా, జనగణమన చిత్రీకరణ దశలో ఉంది. ఛార్మి మాయలో పడి దర్శకుడు పూరి తన భార్య లావణ్యను, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారనే వాదన కూడా ఉంది. చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత బండ్ల గణేష్ పరోక్షంగా ఇదే చెప్పారు. జీవితంలోకి వ్యాంప్ లు, ర్యాంప్ లు వస్తూ పోతూ ఉంటాయి. భార్యా పిల్లలే శాశ్వతమని బండ్ల గణేష్.. పూరి ఇన్ డైరెక్ట్ గా క్లాస్ పీకాడు.

    Also Read: Quarrels in Samantha house: సమంత ఇంట్లో గొడవలు.. చెంపచెళ్లుమనిపించిన కన్నతల్లి!

    ఇక్కడ ఛార్మిని ఉద్దేశించే బండ్ల వ్యాంప్ అన్నాడని అందరూ భావించారు. అలాగే, తనకు భర్తను దూరం చేస్తుందనే అక్కసుతో ఛార్మిని లావణ్య కొట్టారని కూడా వార్తలు వెలువడ్డాయి. ఇంత రామాయణం జరుగుతుండగా ఎట్టకేలకు పూరి నోరు విప్పాడు. ఛార్మితో తనకు ఉన్న రిలేషన్ ఏమిటో బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ. ”ఛార్మి నాకు 13 ఏళ్ల వయసు నుండి తెలుసు. దశాబ్దాలుగా ఆమెతో పని చేస్తున్నాను. ఛార్మి వయసులో ఉంది కాబట్టి ఈ పుకార్లు వస్తున్నాయి. ఆమెకు కూడా 50 ఏళ్ళు ఉంటే ఎవరూ ఇలా మాట్లాడుకోరు. అందులోనూ ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆకర్షణ ఎక్కువ కాలం నిలవదు. కొన్నాళ్లకు బోర్ కొట్టేస్తుంది. ఛార్మి నేను బెస్ట్ ఫ్రెండ్స్, అందుకే ఏళ్లుగా కలిసి ఉంటున్నాం. ఇకపై కూడా కలిసి ఉంటాము. స్నేహానికి మించి మా మధ్య ఎలాంటి బంధం లేదు” అన్నారు.

    Puri Jagannadh- Charmi

    మొత్తంగా ఛార్మి తనకు స్నేహితురాలు మాత్రమే, అంతకు మించి ఎలాంటి సంబంధం లేదన్నారు పూరి. మరి ఆయన మాటల్లో ఎంత వరకు వాస్తవం ఉందనేది వాళ్ళకే తెలియాలి. కాగా ఛార్మి నిర్మాతగా ఉన్న లైగర్ మూవీ ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమాతో ఆమె తన దశ తిరుగుతుంది అని ఆశ పడుతుంది. చూడాలి.. లైగర్ పరిస్థితి ఎలా ఉంటుందో.

    Also Read:Mahesh- Trivikram Movie: ఇంత తక్కువ టైం లో మహేష్ తో త్రివిక్రమ్ వల్ల అవుతుందా?.. అయితే అది సంచలనమే!

     

     

    Tags