Pegasus Issue In Ap: ఇప్పుడు పెగాసస్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణలతో ఏపీ భుజాలు పునుక్కుంటోంది. దీదీ చెప్పిన మాటలకు ఏకంగా విచారణ దాకా వెళ్లింది. చంద్రబాబుపై మమత చేసిన నిందలకు ఏపీ ప్రభుత్వం విచారణకు సైతం ముందుకెళ్లింది. అది ఏదో ఏసీబీ, సీబీఐతో కాకుండా ఏకంగా సభాసంఘం నియమించి తన అమాయకత్వాన్ని మరోసారి బయటపెట్టింది. దీంతో ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి.
మమతా బెనర్జీ తరువాత మాట మారిస్తే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీదీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ వైసీపీ మాత్రం దాన్ని ఆధారంగా చేసుకుని చంద్రబాబుపై చర్యలకు ఉపక్రమించింది. అసెంబ్లీ సభా సంఘంతో విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని సూచించింది. వైసీపీ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
Also Read: నిన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’..చరిత్రకు మరో కోణమా లేక మరో వివాదమా?
టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేశారని మమత చేసిన వ్యాఖ్యల్లో స్పష్టత లేదు. ఆధారాలు లేవు. వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేసుకుని బురదలో కాలేసిందనే విమర్శలు వస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేశారని దీదీ చేసిన ఆరోపణలకు ఎటు చూసినా స్పష్టత కనిపించడం లేదు. దీనిపై గంటల తరబడి చర్చ పెట్టి సభాసంఘం ఏర్పాటు చేసింది.
తరువాత కాలంలో మమతా బెనర్జీ ప్లేటు ఫిరాయిస్తే దిక్కెవరు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు ఆమె ఆరోపణల్ని ఖండించారు. తాము పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేయలేదని చెప్పారు. దీనిపై భవిష్యత్ లో జరగబోయే అన్నింటికి వైసీపీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే వైసీపీ పరువు గంగలో కలిసే సూచనలున్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక ఆధారాలు లేకున్నా సభా సంఘం ఏర్పాటు చేయడమేమిటని అందరిలో సంశయాలు వస్తున్నాయి. శాస్త్రీయ ఆధారాలు ఉంటేనే విచారణ బలంగా ఉండేదని చెబుతున్నారు. వైసీపీ నిర్వాకంతో భవిష్యత్ పరిణామాలు ఎటు దారి తీస్తాయో తెలియడం లేదు. తొందరపడి సభా సంఘం నియమించి తప్పుడు నిర్ణయం తీసుకుందనే వాదన కూడా వస్తోంది.
మమతా బెనర్జీ చెప్పిన మాటలతో చంద్రబాబుపై విచారణకు సభా సంఘం వేయడం చర్చనీయాంశం అయింది. నివేదిక ఎలా వస్తుందో తెలియదు కానీ వైసీకీ మాత్రం భంగపాటే అని తెలుస్తోంది. వైసీపీ సమగ్ర దర్యాప్తు చేయించేందుకు చిత్తశుద్ధితో కాకుండా ఏదో చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
Also Read: జనసేన క్షేత్రస్థాయి బలోపేతానికి నడుం బిగించిన పవన్ కళ్యాణ్