https://oktelugu.com/

కరోనా భయంతో పోలీస్ స్టేషన్ మూసివేత..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కరోనా భయంతో ఏకంగా పోలీస్ స్టేషనే మూసివేయాల్సి వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రజల్లో కరోనా భయం ఎంతలా ఉందో ఈ ఒక్క సంఘటన అర్థంపడుతోంది. ఈ వార్త ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో ఓ మహిళకు కరోనా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 24, 2020 2:07 pm
    Follow us on


    తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కరోనా భయంతో ఏకంగా పోలీస్ స్టేషనే మూసివేయాల్సి వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రజల్లో కరోనా భయం ఎంతలా ఉందో ఈ ఒక్క సంఘటన అర్థంపడుతోంది. ఈ వార్త ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

    కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు

    కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. సదరు మహిళ చైతన్య కాలనీలోని కుమారుడితో నివాసం ఉంటోంది. దీంతో ఆమె కుమారుడు తనకు కూడా కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను కోరాడు. తల్లికి ప్రైమరీ కాంట్రాక్ట్ అయిన కుమారుడికి కరోనా టెస్టులు చేసేందుకు వైద్యులు నిరాకరించారు. కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేస్తామని వైద్యులు తెగేసి చెప్పారు. దీంతో సదరు వ్యక్తి బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వైద్యులపై ఫిర్యాదు చేశాడు.

    లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్

    తన తల్లికి కరోనా పాజిటివ్ వచ్చిందని పోలీసులకు వివరించారు. ఆమెతో ప్రైమరీ కాంట్రాక్ట్ అయిన తనకు కూడా కరోనా టెస్టులు చేయించాలని కోరారు. ఆ యువకుడికి పోలీసులు నచ్చజెప్పిన వినకపోవడంతో చివరికి ఆస్పత్రికి తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళకి ఆ యువకుడు ప్రైమరీ కాంట్రాక్ట్ కావడంతో పోలీసులు పోలీస్ స్టేషన్ ను మూసివేశారు. మహిళతో కాంటాక్టు ఉన్నవారు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయం బాన్సువాడలో ప్రచారం కావడంతో కొంతమంది వ్యాపారులు స్వచ్చంధంగా లాక్డౌన్ విధించుకున్నారు. కాగా మంగళవారం కామారెడ్డిలో పది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.