https://oktelugu.com/

కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వానికి సమస్యలు..

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఇదే జరిగితే రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలు కాస్త 25 జిల్లాలకు పెరిగే అవకాశం ఉంది. కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్ లో సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వమైనా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం కొత్త జిలాలకు కలెక్టర్ ల నుంచి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 24, 2020 1:20 pm
    Follow us on


    రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలని ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఇదే జరిగితే రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలు కాస్త 25 జిల్లాలకు పెరిగే అవకాశం ఉంది. కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్ లో సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన అనంతరం ఏర్పడిన తొలి ప్రభుత్వమైనా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం కొత్త జిలాలకు కలెక్టర్ ల నుంచి ప్రతిపాదనలు కోరింది, వారిచ్చిన ప్రతిపాదనలపై ముందుకు వెళ్ళకుండానే ఐదేళ్లు పూర్తయ్యాయి. మరోవైపు తెలంగాణా పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు ఎప్పుడో పూర్తి చేసినా ఏపీలో మాత్రం ఆ దిశగా ముందడుగు పడలేదు.

    కరోనా పరీక్షల పేరుతో వల పన్నుతున్న సైబర్ కేటుగాళ్లు

    కొత్త జిల్లాల వ్యవహారం అంత తేలిగ్గా సాగిపోయేది కాదు. భౌగోళికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. విజయవాడకు కొత్త వేటు దూరంలో ఉన్న గన్నవరం మండలం మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంది. గన్నవరం నుంచి మచిలీపట్నం వెళ్లాలంటే కనీసం 70 నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇదే విధంగా పలు జిల్లాలో భౌగోళిక సమస్యలు ఉన్నాయి. కొన్ని చోట్ల పార్లమెంట్ నియోజకవర్గంకు సంబందంలేని ప్రాంతాలను జిల్లాలుగా చేయాలనే డిమాండ్ ఉంది. ఈ సమస్యలు అన్నింటినీ ముందు పరిష్కరించాల్సి ఉంది.

    నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

    కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే వాటికి పేర్లు పెట్టె విషయంలోను ఎన్నో ఇబ్బందులు తప్పని పరిస్థితి ఉంది. తెలంగాణా లోను ఈ విషయంలో సర్కారు సమస్యలను ఎదుర్కొంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారనే వాదనలు వినిపించినా ఏడాది వరకూ ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది.

    తాజాగా సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు కృష్ణా జిల్లా పర్యటనలో ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లిన జగన్ ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెడతానని హామీ ఇచ్చారు. కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏర్పడే కొత్త జిల్లాకు ఈ పేరు పెట్టి తన హామీ నెరవేర్చుకుంటారని సమాచారం. మూడు రాజధానుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం జిల్లాల పునర్విభజన విషయంలో ఎంత వరకూ ముందుకు వెళుతుందనేది ప్రశ్నర్ధకంగా మారింది.