Rajasthan Woman: వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందంటారు. సెల్ ఫోన్లో చాటింగులు చేస్తూ మోజులో పడిపోతున్నారు. సరదాగా లూడో గేమ్ ఆడుతూ పాకిస్తాన్ కు చెందిన యువకుడితో ప్రేమలో పడింది. అతడితోనే తన జీవితాన్ని గడపాలని భావించింది. కానీ అప్పటికే ఆమెకు పెళ్లయి ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. వారిని వదిలేసి తన సుఖం కోసం ఆ యువకుడి దగ్గరకు వెళ్లేందుకు నిర్ణయించుకుంది. ఇదే అదనుగా భావించి దేశ సరిహద్దులు దాటాలని నిర్ణయించుకుంది. అటారీ వెళ్లేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది. దీంతో వారు కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటికి పంపించారు.

రాజస్తాన్ లోని ధోల్ పూర్ కు చెందిన శివానీ అనే మహిళ పాకిస్తాన్ కు చెందిన ఆలీ అనే యువకుడితో లూడో గేమ్ ఆడుతూ పరిచయం పెంచుకుంది. చాటింగ్ ద్వారా అతడితో ప్రేమలో పడింది. అతడితోనే జీవితం గడపాలని నిర్ణయించుకుంది. దీంతో దేశ సరిహద్దులు దాటేందుకు కూడా ప్రయత్నించింది. కానీ పోలీసులకు దొరికడంతో శివానీ ప్లాన్ రివర్స్ అయింది.
ప్రేమకు హద్దులు లేవని తెలిసినా సరిహద్దులు దాటాలని భావించిన శివానీది మాత్రం నిజంగా పిచ్చి ప్రేమ అని తెలుస్తోంది. పెళ్లయి భర్త, పిల్లలు ఉన్న ఆమె పాకిస్తాన్ దేశానికి చెందిన యువకుడిని ప్రేమించడం నిజంగా పిచ్చి పనిగానే చూస్తున్నారు. పాకిస్తాన్ వెళ్లే క్రమంలో ఆమె జలియన్ వాలాబాగ్ దగ్గర శివానీ ఆటోలో మాట్లాడిన సంభాషణలు విన్న ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడంతో శివానీని అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల కాలంలో సరదాగా ఆడే ఆటలతో అట్రాక్ట్ అయి ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. వివాహిత అయి ఉండి కూడా తన సుఖం కోసం దేశ సరిహద్దులు దాటాలని భావించిన శివానీ తీరు గురించి అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. భర్త, కొడుకును కాదనుకుని వెళ్లడానికి సిద్ధపడటం ఆందోళన కరమే. కానీ ఎట్టకేలకు పోలీసులకు చేరడంతో ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు.
నేటి కాలంలో సెల్ ఫోన్ లో చాటింగులు చేస్తూ బిజీగా గడుపుతున్న యువత పెడదారి పడుతోంది. ఏది మంచో ఏది చెడో తెలియని వయసులో ఆకర్షణను ప్రేమగా భావించి జీవితాలను శిథిలం
చేసుకుంటున్న సంఘటనలు జరుగుతున్నా ఇంకా కూడా రియలైజ్ కావడం లేదు. దీంతో వారి జీవితాలు అర్థంతరంగానే ముగుస్తున్న తీరు కూడా చూస్తూనే ఉన్నాం.
Also Read: Assembly Elections: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: 2024లో బీజేపీ గెలుస్తుందా లేదా తేలబోతోంది?
ఇప్పటికైనా యువత సెల్ ఫోన్ ను నమ్ముకుని అనవసరంగా చాటింగ్ ల పేరుతో కాలయాపన చేస్తూ చివరకు అదే ప్రేమగా భావించి మోసపోవద్దు. ఎవరో తెలియని వారి కోసం మన సర్వస్వం త్యాగం చేయడం నిజంగా పిచ్చే. దీంతో జాగ్రత్తగా ఉంటూ మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని తెలుసుకోవాలి.
[…] […]
[…] […]