రేవ్ పార్టీ పేరుతో విందు.. సీఐ చిందు.. చివరికి సస్పెన్షన్

దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోంది. విదేశీ నాగరికత పేరుతో మన సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇటీవల బెంగుళూరు నగరంలో పలు హోటళ్లు, క్లబ్బులపై దాడి చేసిన పోలీసులకు వందల సంఖ్యలో విటులు, వేశ్యలు పట్టుబడడం తెలిసిందే. ఇదే కోవలో తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన రేవ్ పార్టీ సంచలనం సృష్టించింది. ఏకంగా సీఐ సస్పెన్షన్ కు దారి తీసింది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన సీఐ విచ్చలవిడి […]

Written By: Raghava Rao Gara, Updated On : August 4, 2021 5:23 pm
Follow us on

దేశంలో పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోతోంది. విదేశీ నాగరికత పేరుతో మన సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారు. విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇటీవల బెంగుళూరు నగరంలో పలు హోటళ్లు, క్లబ్బులపై దాడి చేసిన పోలీసులకు వందల సంఖ్యలో విటులు, వేశ్యలు పట్టుబడడం తెలిసిందే. ఇదే కోవలో తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన రేవ్ పార్టీ సంచలనం సృష్టించింది. ఏకంగా సీఐ సస్పెన్షన్ కు దారి తీసింది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన సీఐ విచ్చలవిడి ప్రవర్తనకు ఆయన విధుల నుంచి తీసేయడం గమనార్హం.

గుంటూరులో జరిగిన జన్మదిన వేడుకల్లో అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐ వెంకటేశ్వర్ రావుపై వేటు పడింది. నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్ లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకకలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో తన స్నేహితులతోపాటు మద్యం సేవించిన ఆరుగురు యువతులతో కొందరు డాన్సులు చేశారు. దీంతో విచ్చలవిడిగా మద్యం తాగి మత్తులో చిందేయడంపై పోలీసులకు సమాచారం అందింది. వారు తమ బలగాలతో దాడి చేయగా అందులో సీఐ కూడా ఉండడం గమనార్హం.

ఈ నేపథ్యంలో పక్కా సమాచారం అందుకున్న గుంటూరు పట్టాభిపురం పోలీసులు దాడి చేసి 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కొవిడ్ నిబంధనలు అతిక్రమించడం, అధిక శబ్దాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడంతోపాటు మద్యం సేవించడం, అసభ్యకర నృత్యాలు చేసిన కేసులు నమోదు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పార్టీకి అర్బన్ సీసీఎస్ లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర్ రావు కూడా హాజరయ్యారని తేలడంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు.

ఇప్పటికే రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా పార్టీల పేరుతో యువత చిందులేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలోని పలు హోటళ్లు, క్లబ్బులు, ఫాం హౌస్ ల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం. పోలీసులు కూడా చూసీచూడనట్లు వదిలేయడంతో ఇవన్నీ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని పలు నగరాల్లో ఈ విచ్చలవిడి తతంగాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.