Kashmir: దేశంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని లక్ష్యంగా పెంట్టుకుంది. ఇందులో భాగంగానే ఆర్టిక్ 370ని రద్దు చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో దాగి ఉన్న మద్దతుదారుల నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో ఉంది. ఈ ఓవర్‌గ్రౌండ్ వ్యవస్థ ఆయుధాలు, ఆశ్రయాలు, రహస్య సహాయాల ద్వారా ఉగ్రవాదానికి ఆధారం. తాజా చర్యల్లో లష్కర్–ఏ–తొయిబా, జైష్–ఏ–మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు సహకరించిన ఐదుమంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించి అరెస్టు చేశారు. ఇది 2021 నుంచి జరుగుతున్న వ్యాపక కార్యాచరణలో భాగం.
ఐదుగురి రహస్య కార్యకలాపాలు..
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగలు చేస్తూ.. ఉవ్రాదులకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐదుగురూ వివిధ రకాలుగా ఉగ్రవాదులకు సహకరించారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్ట్ చేసి ఉద్యోగాల నుంచి తొలగించారు.
మహ్మద్ ఇషాక్:
ఇతను విద్యాలయ ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో తీవ్రవాద భావాలు నాటి, లష్కర్ నాయకుడు అబు కోలాయ్‌తో కలిసి పనిచేశాడు. 2022లో పట్టుబడ్డాడు.
తారిక్ అహ్మద్ రా..
ఇతను కార్మిక శాఖలో పనిచేస్తూ హిజ్బుల్ ఉగ్రవాది అమీన్ బాబాను పాకిస్తాన్‌కు తప్పించాడు.
ఫారుఖ్ అహ్మద్ భట్..
ఇతను అటవీ విభాగంలో ఉండగా, ఒక శాసనసభ్యుని వాహనంలో హిజ్బుల్ ఉగ్రవాదిని సరిహద్దు దాటించాడు. తారిక్ రాహ్‌తో కలిసి ఈ కుట్ర రచించాడు.
బషీర్ అహ్మద్ మీర్..
ఇంజనీరింగ్ శాఖలో ఆయుధాలు, ఆశ్రయాలు అందించి లష్కర్‌కు మద్దతు ఇచ్చాడు. ఇంట్లో రెండు ఏకే–47లు స్వాధీనం.
మహ్మద్ యూసుఫ్..
ఆస్పత్రి అంబులెన్స్ డ్రైవర్‌గా ఉగ్రవాదులను తరలించి, హిజ్బుల్‌కు సహకరించాడు. ఆస్పత్రి నిర్వాహకుల మద్దతు కూడా బయటపడింది.
2021 నుంచి ఏరివేత షురూ..
ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత ప్రభుత్వం ఈ రహస్య నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టింది. 2021లో ప్రారంభమైన కార్యాచరణలో ఇప్పటివరకు 85 మంది ఉద్యోగులను తొలగించారు. విద్యా, వైద్య, అటవీ, కార్మిక, ఇంజనీరింగ్ శాఖల్లో ఈ మద్దతుదారులు ఆధారాలు కలిగి ఉగ్రవాదానికి ఆక్సిజన్‌గా పనిచేశారు. ఈ ప్రక్రియ వేగవంతమైతే ఉగ్రవాదం బలహీనపడుతుందని నిపుణులు అంచనా.
ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేయాలంటే కఠిన తనిఖీలు, ఇంటెలిజెన్స్ మానిటరింగ్ కీలకం. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో రాడికలైజేషన్‌ను అరికట్టడం, ఆయుధ పరపటి బ్రేక్ చేయడం అవసరం. ఇది దీర్ఘకాలిక భద్రతకు బలమైన పునాది వేస్తుంది, కశ్మీర్ స్థిరత్వాన్ని నెలకొల్పుతుంది.