
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం బీజేపీకి ప్లస్‌గా మారబోతుందా..? దీన్ని ఆసరా చేసుకొని ఏపీలోని రెండు పార్టీలకు చెక్ పెడుతోందా..? అంటే తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే నిజమే అనిపిస్తోంది. ప్రాజెక్టును ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరిన టీడీపీ ఎంత పనులు చేపట్టిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ 2022 నాటికి కంప్లీట్ చేస్తామని చెబుతుంది. కానీ, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అధిసాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
Also Read: అంతా ఏకపక్షమే..!
ప్రాజెక్టును తమకు అప్పగించేలా కేంద్రం వ్యూహం
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మీరే నిర్మించడంటూ రాష్ట్రంలోని రెండు పార్టీలు తన వద్దకు వచ్చేలా సమీకరణాలు సిద్ధం చేస్తోంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఆర్థికంగా, రాజకీయ పరిస్థితులే బలం చేకూరుస్తున్నాయి.
పైసలన్నీ సంక్షేమానికే..
ఏ రాష్ట్రమైనా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అది మంచిదే..! కానీ ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు అభివృద్ధి కార్యక్రామలపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఇలాగే ఉన్నది. అసలే లోటు బడ్జెడ్‌తో ఏర్పడిన రాష్ట్రం.. అందులో కరోనా ఎఫెక్ట్.. ఆదాయం అంతంత మాత్రమే వస్తుంది. ఈ పైసలన్నీ సంక్షేమ పథకాల అమలుకే సరిపోతున్నాయి. కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చిల్లిగవ్వ కూడా లేకుండా పోతుంది.
Also Read: ఫిబ్రవరిలోనే ఏపీ స్థానిక ఎన్నికలు
పోలవరం ఎలా.. ?
సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగుల జీతభత్యాలకే అప్పులు చేయాల్సిన తరుణంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎలా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇది జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర వాటా, ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ.. ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని అప్పజెప్పడమే బెటర్ భావన కూడా కొందరిలో ఉన్నది. బీజేపీకి కావాల్సింది కూడా ఇదే.. ఎలాగూ సింహభాగం నిధులు ఇచ్చేది తామే కాబట్టి.. ప్రాజెక్టును తమ అకౌంట్లో వేసుకుంటే రాష్ట్రంలో బలపడొచ్చినే ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ, వైసీపీ సర్కారు ఇందుకు అంగీరిస్తుందా అనేది అనుమానమే..! అసలే టీడీపీ అవకాశం ఎదురు చూస్తున్నది..
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్