Homeజాతీయ వార్తలుYasho Bhoomi: ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన "యశో భూమి" విశిష్టతలు మీకు తెలుసా?

Yasho Bhoomi: ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన “యశో భూమి” విశిష్టతలు మీకు తెలుసా?

Yasho Bhoomi: మొన్ననే ఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహించిన జి20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ మండపం అనే కన్వెన్షన్ హాల్ నిర్మించింది. ఈ మండపాన్ని న భూతో, న భవిష్యత్తు అనే స్థాయిలో నిర్మించింది. ఇందులోని అత్యాధునిక సౌకర్యాలు చూసి ప్రపంచ దేశాల అధినేతలు మంత్రముగ్ధులయ్యారు. అయితే ఈ సమావేశాలు ముగిసిన కొద్ది రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా “యశో భూమి” అనే యాష్ ట్యాగ్ తో కొన్ని చిత్రాలను పోస్ట్ చేశారు. వాటి గురించి ఎటువంటి వివరాలు చెప్పకుండానే చూసే వాళ్లలో ఉత్సుకత పెంచారు. అయితే చాలామంది ఆ దృశ్యాలు చూసి ఎక్కడో పాశ్చాత్య దేశాలలో నిర్మించిన బహుళ అంతస్తులు కావచ్చు అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభిస్తున్న భవనం అని మోడీ తేల్చేశారు. ఇంతకీ ఆ భవనం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత అట్టహాసంగా నిర్మించింది? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీ ప్రాచీన కట్టడాలకు, దర్శనీయమైన క్షేత్రాలకు నిలయం. అయితే ఈ దేశ రాజధాని కీర్తి కిరీటంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కలికి తురాయిని చేర్చింది. తిప్పుకోనివని సుందరమైన, అత్యంత విశాలమైన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్ (ఐఐపీసీ) ను నిర్మించింది.. దీనికి యశో భూమి అని పేరు ఖరాబ్ చేసింది. అత్యంత విశాలంగా నిర్మించిన ఈ సముదాయంలో సమావేశాలు, సభలు, ప్రదర్శనలు చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం దీనిని అత్యంత అట్టహాసంగా నిర్మించింది. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో నిర్మించింది కాబట్టి దీనికి యశో భూమి అని నామకరణం చేసింది. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. అద్భుతమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. ప్రధాన ఆడిటోరియం, కన్వెన్షన్ హాళ్ళు, బాల్, మీటింగ్ రూం లు ఈ సముదాయానికి ప్రధాన ఆకర్షణ. ఈ కన్వెన్షన్ సెంటర్ ప్రపంచంలో అతిపెద్ద వాటిలో ఒకటి అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని మొదటి దశను ప్రధానమంత్రి ఆదివారం ప్రారంభించారు.

ఇవీ విశేషాలు

యశో భూమి కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు ఏరియా 8.9 లక్షల చదరపు మీటర్లు. బిల్డ్ అప్ ఏరియా 1.8 లక్షల చదరపు మీటర్లు. కన్వెన్షన్ సెంటర్ ను 73 వేల చదరపు మీటర్లకు పైగా వైశాల్యంలో నిర్మించారు. మొత్తం ప్రాజెక్టులో ప్రధాన ఆడిటోరియంతో సహా మొత్తం 15 కన్వెన్షన్ హాళ్ళు,ఒక బాల్ రూమ్, 13 మీటింగ్ రూమ్ లు ఉన్నాయి. అన్ని గదులు కలిపి 11000 మంది ఒకేసారి కూర్చోవచ్చు. 6000 మంది కూర్చునే విధంగా ప్రధాన ఆడిటోరియం ఆటోమేటెడ్ సీటింగ్ సిస్టంతో నిర్మించారు. బాల్ రూమ్ లో అత్యధిక సీలింగ్ నిర్మించారు. ఈ రూమ్ సీటింగ్ సామర్థ్యం 2,500 మంది. మరో 500 మంది కోసం ఓపెన్ ఏరియా నిర్మించారు. అలాగే 1.7 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో ఎగ్జిబిషన్ హాల్స్ నిర్మించారు. మీడియా ప్రతినిధుల కోసం గదులు, వివిఐపీ గదులు, విజిటర్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్, టికెటింగ్ కౌంటర్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూనే ఇక్కడ వర్షపు నీటిని, మురుగు నీటిని శుద్ధి చేసి వాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సౌర విద్యుత్ కోసం రూప్ టాప్ సోలార్ ప్యానళ్ళు నిర్మించారు. ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో భారతీయ సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. యశో భూమి కన్వెన్షన్ సెంటర్ భారతీయ పరిశ్రమల సమాఖ్య కు చెందిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గ్రీన్ సిటీస్ ప్లాటినం సర్టిఫికెట్ పొందడం విశేషం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular