PM Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి కొద్దిసేపట్లో ప్రసంగించనున్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై తన ప్రసంగంలో ప్రస్తావిస్తారని అందరూ ఊహిస్తున్నారు. మరికొందరైతే కరోనా వ్యాక్సినేషన్ గురించి స్పష్టమైన ప్రకటన చేస్తారని చెబుతున్నారు. కానీ ఇంకొందరు పెట్రోధరల పెరుగుదలపై ప్రజలకు మంచి కబురు చెబుతారని ఆలోచిస్తున్నారు. ఏదిఏమైనా ప్రధాని ప్రసంగంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆయన ఇప్పటికే మన్ కీ బాత్ ద్వారా రేడియోలో తన మనోభావాలు పంచుకుంటున్న ప్రధాని ఇవాళ చెప్పే దానిపైనే అందరి అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఉదయం పది గంటలకు ప్రధాని మాట్లాడతారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది. చాలా రోజుల తరువాత ప్రధాని ప్రసంగం ఉండటంతో ఆయన మాటలపై అప్పుడే అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రధాని ఏం మాట్లాడతారు? దేనిపై ప్రసంగిస్తారు? అనే విషయాలపై ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశంలో నెలకొన్న సమస్యల నేపథ్యంలో ఆయన ప్రసంగం ఉంటుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
దేశంలో ప్రస్తుతం పెట్రోధరలు, రైతుల ఆందోళన ప్రధాన సమస్యలుగా ఉన్న నేపథ్యంలో ఆయన వీటిపైనే ప్రస్తావిస్తారని సమాచారం. కానీ దీపావళి సందర్భంగా ప్రజలకు తీపి కబురు చెప్పేందుకు పెట్రోధరలు తగ్గించేందుకు కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా పెట్రో ధరలు తగ్గించే క్రమంలో పలు చర్యలు తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోధరలు తగ్గించకపోతే భవిష్యత్ ప్రశ్నార్థకమే అని సంకేతాలు వస్తున్న క్రమంలో ప్రధాని పెట్రో ధరల తగ్గుదలపైనే మాట్లాడతారని కొందరి వాదన.
మరోవైపు కరోనా రక్కసి సృష్టించిన భయోత్పాతాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుని కోటి మందికి టీకా డోసులు వేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగం ఉంటుందని మరో వార్త సంచలనం సృష్టిస్తోంది. దీంతో మొత్తానికి ప్రధాని ప్రసంగంపై అందరిలో టెన్షన్ ఏర్పడింది. కొద్ది సేపట్లోనే దీనికి సమాధానం దొరుకుతుందని తెలుస్తోంది. అందుకే అందరు ప్రధాని ప్రసంగంపై ఆతృతగా ఎదురుచూస్తున్నారు.