PM Modi Telangana Visit: భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఈ పేరు పలకడానికే కేసీఆర్ జంకుతున్నారు. ఏడాది క్రితం వరకు ‘మోడీ లేడు.. బోడీ లేడు.. నిన్ను గద్దె తించుతా.. బీజేపీని బంగాళా ఖాతంలో కలుపుతా కేంద్రంలో చేతగాని ప్రభుత్వం ఉంది. 2024 వచ్చేది కిసాన్ సర్కార్..’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కానీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ, ఈడీ విచారణ చేయడం ఎప్పుడు మొదలు పెట్టిందో.. అప్పటి నుంచి అప్పటి నుంచి మోదీ పేరు చెబితేనే గులాబీ బాస్‌కు జ్వరం వస్తోంది. తెలంగాణకు ప్రధాని వస్తున్నారంటే.. డాక్టర్లు ప్రగతి భవన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. తాజాగా అక్టోబర్ 1న ప్రధాని తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా వచ్చింది. ఇకేముందు కేసీఆర్‌కు మళ్లీ ఫీవర్ వచ్చింది.. పది మంది వైద్యులు పరుగు పరుగున ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్‌కు పరీక్షల మీద పరీక్షలు.. టీట్ర్‌మెంట్ మీద ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ఈ విషయం స్వయంగా ఆయన తనయుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావే వెల్లడించారు.
ముఖం చూపించలేకనే..
ప్రధాని పదవికి కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్‌కు ప్రధాని మోదీ ఎదుట నిలబడేందుకు కూడా ముఖం చెల్లడం లేదు. దీంతో ప్రధాని పర్యటనకు దాదాపు మూడున్నరేళ్లుగా కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. మోదీ ఎదుట నిబడే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ భయంతోనే కేసీఆర్‌కు జ్వరం వస్తున్నట్లు తెలంగాణలో బీజేపీ శ్రేణలు ప్రచారం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తనకు జ్వరం వచ్చిందని, యశోదా ఆస్పత్రికి చెందిన ఐదుగరు వైద్యులు తనకు చికిత్స చేస్తున్నారు అని కేసీఆర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని బయటకు చెప్పారు. కేటీఆర్ ప్రకటించిన కాసేపటికే కేసీఆర్ ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఈ పోస్టు ప్రత్యక్ష కావడం గమనార్హం.
1న మోదీ రాక..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబర్ 1న అధికారిక పర్యటన కోసం తెలంగాణకు రాబోతున్నారు. హైదరాబాద్‌లో అధికారిక కార్యక్రమం తర్వాత రాజకీయసభ కోసం మహబూబ్‌నగర్ వెళ్తారు. మళ్లీ మూడో తేదీన కూడా తెలంగాణకు వస్తారు. బీజేపీపై యుద్ధం ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఎప్పుడూ మోదీకి స్వాగతం చెప్పలేదు. సీనియర్ మంత్రి తలసానికి బాధ్యతలిచ్చేవారు. యథావిధిగా ఈసారి కూడా ఆయనకే చాన్సిస్తారు. ప్రత్యేకంగా ప్రకటన చేయాల్సిన పని లేకుండా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని కేటీఆర్ ముందుగానే సమాచారం ఇచ్చేశారు. రాజకీయంగా ఇప్పుడు కీలకమైన సమయం. అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్.. ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. రేపోమాపో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఆయనకు జ్వరం కారణంగా కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలను చూసకునే పరిస్థితి లేకపోవడంతో మొత్తం వ్యవహారాల్ని కేటీఆరే చక్క బెడుతున్నారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.