
PM Modi Shares : ప్రధాని నరేంద్ర మోదీకి ఫోటోలు దిగడం అన్నా.. ఫోటోలు తీయడం అన్న తెగ ఇష్టం. వీలైనప్పుడల్లా కెమెరా పట్టి తనకు నచ్చిన దృశ్యాలను ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు. తాజాగా విమానంలో ప్రయాణిస్తూ ఆయన ఫోటోగ్రాఫర్ అవతారమెత్తారు. ఫ్లైట్ నుంచి స్వయంగా ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ తీసిన ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
-సోషల్ మీడియాలో యాక్టివ్ గా..
ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడూ ఆసక్తికరమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈసారి స్వయంగా తాను హెలికాప్టర్ నుంచి తీసిన వీడియో షేర్ చేశారు. శుక్రవారం మోడీ ముంబై పర్యటనకు వెళ్లారు. ఇక్కడ రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లో వెళుతుండగా ముంబైని ఏరియల్ వ్యూ షూట్ చేశారు. వీడియో వైరల్‌గా మారింది. “ముంబై అద్భుతంగా కనిపించడం లేదా!? ఈరోజు ముందు నా పర్యటన సందర్భంగా ఈ వీడియో తీశాను” అని మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
-గతంలో చెన్నై ఫోటోలు..
గతంలో చెన్నై పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ తాను ప్రయాణిస్తున్న విమానం నుంచి చెన్నై మహా నగరాన్ని ఇలాగే ఫోటో తీశారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. విమానం నుంచి ప్రధాని మోదీ తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు అందమైన క్యాప్షన్ ఇచ్చారు. ” చెన్నైలో జరిగిన ఆసక్తికరమైన టెస్ట్ మ్యాచ్ యొక్క క్షణిక వీక్షణను పొందాను” అని క్యాప్షన్ రాసి ట్వీట్ చేశారు. ఆ ఫోటో చాలా వైరల్ అయింది. మోదీ పోస్ట్ చేసిన ఈ ఫోటోపై నెటిజన్లు ప్లశంసలు కురిపించారు. ఇండియా కచ్చితంగా గెలుస్తుంది మోదీ సర్ అంటూ కామెంట్లు పెట్టారు.
– చీతాలను విడుదల చేసి..
ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులోకి వదిలేరు మోదీ. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చీతాలను ఎన్‌క్లోజర్ల నుంచి నేషనల్ పార్కులోకి వదిలి స్వేచ్ఛ కల్పించారు. అక్కడే ప్రాజెక్ట్ చీతాను ప్రారంభించారు. వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్ లా జాకెట్, హ్యాట్, కళ్ల జోడు పెట్టుకున్న మోదీ వాటిని ఫొటోలు తీశారు.