https://oktelugu.com/

అమృత్ మహోత్సవ్ కు మోదీ శ్రీకారం..

దేశ 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు ప్రధాన మంత్రి మోదీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను ఆయన జెండా వూపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్ మహోత్సవ్ వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరమోధులను మోదీ స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశంలోని అన్ని […]

Written By: , Updated On : March 12, 2021 / 03:22 PM IST
Follow us on

PM Modi
దేశ 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు ప్రధాన మంత్రి మోదీ శుక్రవారం శ్రీకారం చుట్టారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు నిర్వహించే పాదయాత్రను ఆయన జెండా వూపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్ మహోత్సవ్ వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరమోధులను మోదీ స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశంలోని అన్ని వర్గాలు పాల్గొన్నాయని.. ఆ పోరాట స్ఫూర్తిని దేశం ముందుకు తీసుకుపోతుందని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో యవత్ భారతదేశం ప్రపంచానికి ఆశా కిరణంగా మారిందని చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో స్వావలంబన సాధించడంతో పాటు ఇతర దేశాలకు కూడా అందించే స్థాయికి ఎదిగామని చెప్పుకొచ్చారు.

Also Read: ఢిల్లీకి చేరిన దీదీ పంచాయితీ..

దండి మార్చ్ వార్సికోత్సవం సందర్భంగా ఈ పాదయాత్ర చేపట్టారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దండియాత్ర ప్రారంభమైన సందర్బాన్ని గుర్తు చేసుకుంటూ.. సబర్మతి ఆశ్రమం నుంచి నవసారి లోని దండి వరకు 81మంది 241 మైళ్లదూరం పాదయాత్ర చేపట్టారు. 25రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ఏప్రిల్ 5న ముగుస్తుంది. ఆరోజు దండిలో భీ కార్యక్రమం నిర్వహించనున్నారు.

75ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా కేంద్రం అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపట్టింది. నేటినుంచి దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో 75 వారాల పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి కానుంది. అమృత్ మహోత్సవ్ ప్రారంభం కోసం శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ కు చేరుకున్న మోదీ నేరుగా సబర్మతి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అభయ్ ఘాట్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ ను మోదీ తిలకించారు.

Also Read: ’విజయ డెయిరీ‘ ఆస్తులు పంపిణీ.. ఏపీకి అది సాధ్యమేనా..?

అంతకుముందు మోదీ ట్విట్టర్ వేదికగా చాలా ఆసక్తికరమైన పోస్టు చేశారు. స్థానిక వస్తువులు కొని.. వాటిని వోకల్ ఫర్ లోకల్ యాష్ ట్యాగుతో సోషల్ మీడియాలో పోస్టు చేయాలని ప్రధాని కోరారు. స్తానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడమే మహాత్మా గాంధీకి మనం అర్పించే ఘనమైన నివాళి అని మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్