కేటీఆర్ కు రాములమ్మ దిమ్మతిరిగే కౌంటర్

ఒకప్పుడు కేసీఆర్ కు ముఖ్య అనుచరురాలిగా ఉన్న విజయశాంతి తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి దూరమయ్యారు. కేసీఆర్ కు శత్రువుగా మారారు. కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడడానికి నిరంతరం ఎదురుచూస్తుంటున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా.. తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియా వేదికగా.. అదిరిపోయే సెటైర్ వేశారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో విజయశాంతి ఫైర్ అయ్యారు. Also Read: […]

Written By: Srinivas, Updated On : March 12, 2021 3:11 pm
Follow us on


ఒకప్పుడు కేసీఆర్ కు ముఖ్య అనుచరురాలిగా ఉన్న విజయశాంతి తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి దూరమయ్యారు. కేసీఆర్ కు శత్రువుగా మారారు. కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడడానికి నిరంతరం ఎదురుచూస్తుంటున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా.. తన దూకుడును ప్రదర్శిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ పై సోషల్ మీడియా వేదికగా.. అదిరిపోయే సెటైర్ వేశారు. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తానని కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో విజయశాంతి ఫైర్ అయ్యారు.

Also Read: ’విజయ డెయిరీ‘ ఆస్తులు పంపిణీ.. ఏపీకి అది సాధ్యమేనా..?

‘అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని… తెలంగాణలో తరుచూ వినిపించే సామెతను వదిలారు. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యాలు వింటే అర్థం అవుతోంది. విశాఖ పట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ.. అవసరం అయితే అక్కడికి వెళ్లి.. ఉద్యమంలో పాల్గొంటామని కేంద్రంపై చిర్రుబుర్రులాడారు.

ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ.. అజంజాహి మిల్స్.. ఆల్విన్ కంపెనీ, పాగ్రా టూల్స్ లాంటి పలు కంపెనీలు వందరోజుల్లో తెరిపించి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రమైనా వాటి గురించిన ప్రస్తావన ఎత్తడం లేదు. ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు మాట్లాడే మాటలే తప్పా.. వేరే ఏం కాదని అంటున్నారు బీజేపీ నేతలు.

Also Read: ఢిల్లీకి చేరిన దీదీ పంచాయితీ..

ఈ దొర కుటుంబం యొక్క అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరం.. అవమానించే ధోరణిలో.. బూతు మాటలతో కూడా ఉంటుందో.. ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే మంచిదని .. వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుందని రాములమ్మ తనదైన శైలిలో పంచ్ వేశారు. విశాఖ స్టీల్ ప్లాంటుపై కేటీఆర్ ప్రేమ వెనుక కారణాలేమిటో విజయశాంతి అరటిపండు వలిచినట్లు వివరించారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కేటీఆర్ స్టీల్ ప్లాంటు అంశాన్ని లేవనెత్తితే… దాన్ని తిప్పి కొడుతూ.. విజయశాంతి పోస్టు పెట్టడం విశేషం.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్