PM Modi hails Trump: దశాబ్దాలుగా సాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ విభేదాలకు పరిష్కారం దొరకే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన నూతన శాంతి ఫార్ములా గాజా ప్రాంతంలో కొత్త మార్పుకు దారి తీసేలా కనిపిస్తోంది. ట్రంప్ ఫార్ములా మన ప్రధాని మోదీకి నచ్చింది. ఒకవైపు టారిఫ్ వార్ కొనసాగుతున్నవేళ.. మోదీ.. ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. తెగ పొడిడేశారు.
శాంతికి 20 సూత్రాల ప్రణాళిక
ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల ప్యాకేజీలో బందీల విడుదల, దాడుల నిలుపుదల, అంతర్జాతీయ పర్యవేక్షణ వంటి అంశాలు కీలకంగా ఉన్నాయి. మొదట ఇజ్రాయెల్ అంగీకరించగా, మొదట నిరాకరించిన హమాస్ చివరికి ఒప్పుకోవడం పరిణామాత్మక మలుపుగా మారింది. కొన్ని నిబంధనలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఈ అంగీకారం శాంతి దిశగా మొదటి అడుగుగా భావిస్తున్నారు.
ట్రంప్ హెచ్చరికతో దిగొచ్చిన హమాస్..
హమాస్ తటస్థంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ స్పష్టంగా చెప్పడంతో ఒత్తిడి పెరిగింది. ఆరు గంటల్లో నిర్ణయం తీసుకోవాలన్న ట్రంప్ అల్టిమేటం తర్వాత హమాస్ తన అంగీకారాన్ని ప్రకటించింది. దీంతో గాజాపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి కూడా అమెరికా సూచనలు అందాయి.
Also Read: భారత్ లో నిశ్శబ్ద ఆర్థిక విప్లవం ఏ రంగంలో జరుగుతుంది?
స్వాగతించిన మోదీ..
ఈ పరిణామాలను భారత ప్రధాని మోదీ స్వాగతించారు. ట్రంప్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, బందీల విడుదల శాంతి పునాదిగా మారుతుందని ఎక్స్‌లో తెలిపారు. గాజాలో స్థిరమైన, న్యాయమైన శాంతికి భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
హమాస్ అంగీకారం తాత్కాలిక శాంతికి దారితీసే అవకాశం ఉన్నప్పటికీ, శాశ్వత న్యాయం కోసం రెండు పక్షాలనూ విశ్వాసపూర్వక చర్చలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ట్రంప్ పాత్ర ఈ ప్రక్రియలో కేవలం దౌత్యపరమైన మధ్యవర్తిత్వమే కాక, ప్రపంచ రాజకీయ సమీకరణల్లో అమెరికా స్థాయిని బలపరచే అంగంగా మారింది.