ABN Venkatakrishna latest news: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం కదా.. మీడియా అనేది నిష్పక్షపాతంగా లేదు అని.. వ్యక్తులకు బాకా ఊదే వ్యవస్థ లాగా మారిపోయిందని.. రాజకీయ పార్టీలకు ఊడిగం చేసే స్థాయికి దిగజారిపోయిందని.. అయితే ఇంతకుమించి దిగజారదు అనుకున్న ప్రతిసారీ మీడియా దిగజారుతూనే ఉంది. నేలబారు తనాన్ని చూపిస్తూనే ఉంది. పేపర్, న్యూస్ చానల్స్, యూట్యూబ్ ఛానల్స్.. ఇలా మాధ్యమాలు ఎన్ని ఉన్నప్పటికీ.. అంతిమంగా రాజకీయ పార్టీలకు డబ్బా కొట్టుకుంటూ.. డప్పు కొట్టుకుంటూ బానిసత్వాన్ని నిరూపించుకుంటున్నాయి.
తెలుగులో కాస్త దమ్ము ఉన్న జర్నలిస్టులలో వెంకటకృష్ణ ఒకరు. ప్రస్తుతం ఆయన ఏబీఎన్ లో పనిచేస్తున్నారు. మేనేజ్మెంట్ పొలిటికల్ లైన్ కు అనుగుణంగా ఆయన వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే నేటి కాలంలో మేనేజ్మెంట్లకు పొలిటికల్ వాసనలు ఉన్నాయి కాబట్టి అందులో పని చేసే పాత్రికేయులు కూడా అలానే వ్యవహరించాల్సి ఉంటుంది. కాదు కూడదు అనుకుంటే దూరంగా వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఏబీఎన్ లో వెంకటకృష్ణ ప్రైమ్ టైం డిబేట్ లు సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు. కొన్ని సందర్భాలలో ఆయన తనలో ఉన్న అసలు సిసలైన జర్నలిస్టును బయటపెడుతుంటారు. వాగ్దాటి కూడా ఆయనకు అధికంగా ఉంటుంది కాబట్టి ఏ విషయాన్నయినా సరే మెప్పించగలరు. కానీ కొన్ని సందర్భాలలోనే ఆయన అభాసు పాలవుతుంటారు.
తాజాగా ఏబీఎన్ ఛానల్ లో ఒక డిబేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గురించి ప్రస్తావన వచ్చింది. ఇందులో భాగంగానే రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాదు రావాల్సిన కంపెనీలను ఆంధ్రప్రదేశ్ ఎగరేసుకుపోతోందని వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఏబీఎన్ అనేది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది. అనేక పర్యాయాలు రేవంత్ రెడ్డికి బాసటగా నిలిచింది. ఆంధ్రజ్యోతి కూడా రేవంత్ విషయంలో కాస్త ఉదారతను చూపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదని అర్థమవుతోంది. ఎందుకంటే రేవంత్ విషయంలో ఏబీఎన్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రేవంత్ పనితీరు బాగోలేదని.. అందువల్లే కంపెనీలు మొత్తం ఏపీకి వెళ్లిపోతున్నాయని గొప్పగా సెలవిచ్చారు వెంకటకృష్ణ. పోనీ అదే నిజం అనుకుంటే .. ఎన్ని కంపెనీలు ఏపీకి వచ్చాయి.. ఎంత మేర పెట్టుబడులు పెట్టాయి.. ఎందరికి ఉద్యోగాలు కల్పించాయి.. అనే విషయాలను కూడా వివరిస్తే బాగుండేది. వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తప్పడుతున్నారు. దసరా ముందు రోజు ప్రముఖ సినీ కమెడియన్ రాహుల్ రామకృష్ణ తెలంగాణ ప్రభుత్వం గురించి పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో అడ్డమైన కూతలు కూశాడు. తర్వాత తన వెంట గులాబీ పార్టీ నాయకులు ఉన్నారని.. ఆ సమయంలో మద్యం తాగామని.. అందువల్లే అలాంటి ట్వీట్లు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అంతేకాదు తన ట్విట్టర్ ఎకౌంటు ను డి ఆక్టివేట్ చేశాడు. తెర వెనుక కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకురావడం వల్లే అతడు ఆ పని చేశాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు వెంకటకృష్ణ కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి.. ఏబీఎన్ పరిస్థితి కూడా అలానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇట్ల అన్నందుకు రాహుల్ రామకృష్ణ x అకౌంట్ డియాక్టివేట్ చేసుకొన్నాడు !!
ఇప్పుడు… ABN పరిస్థితి కూడా అంతేనా? pic.twitter.com/CZVZprX3tU— The Samosa Times (@Samotimes2026) October 3, 2025