
దేశంలో కరోనా ముప్పు ఇంకా తగ్గలేదు. మహమ్మారికి సంబంధించిన ప్రమాద సంకేతాలు అందుతూనే ఉన్నాయి. మూడో దశ పొంచి ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరని ప్రభుత్వం చెబుతోంది. మూడో దశ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హెచ్చరిస్తోంది. ఉత్తరాదిలో పర్యాటక ప్రాంతాలపై ఆంక్షలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. దేశంలో జులై 4నే మూడో దశ ప్రారంభమైందని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు స్టేట్ల ముఖ్యమంత్రులతో భేటీ అవుతున్నారు. కరోనా పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఈశాన్య స్టేట్లలో కరోనా పరిస్థితిపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమీక్ష చేశారు. దేశంలో మూడో దశ పొంచి ఉందని చెప్పారు. ప్రజలు నిరంతరం నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కొత్త వేరియంట్లపై పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు. పర్యాటకం, వ్యాపారాలపై కోవిడ్ ప్రభావం ఉంటుందని చెప్పారు. జనం గుంపులుగా తిరగొద్దని వివరించారు. ఈనెల 16న ప్రధాని మోడీ మరో ఆరు స్టేట్ల సీఎంలతో భేటీ కానున్నారని తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందని పీఎంవో తెలిపింది.
దక్షిణాదిలో అందరు సీఎంలతో సమావేశమైనా ఒక్క తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాత్రం కాలేదు. ఈనెల 16న ప్రధాని మోడీ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, ఒడిశా ముఖ్యమంత్రులతో కొవిడ్ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రాంతాల్లో కరోనా కేసులు, మరణాలు అధికంగా ఉండడం తెలిసిందే. కొవిడ్ బాధిత ప్రాంతాల్లో మహారాష్ర్ట టాప్ లో ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఒడిశాలో ఇటీవల కేసులు భారీగా వస్తున్నాయి.
శుక్రవారం నాటి సమీక్షలో దక్షిణాది ప్రాంతాల అందరు సీఎంలతో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తప్ప అందరితో భేటీ కానున్నారు. తెలంగాణలో కేసులు, మరణాలు తక్కువస్థాయిలో ఉండడంతో కేసీఆర్ కు పిలుపొస్తుందో రాదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రభుత్వం చేసే ఉద్యమంలో అందరు భాగస్వాములు కావాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే సీఎంలతో ముఖాముఖి నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.