
ఇక పై ఉద్యోగ నియామకాలను ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్ లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది. ఇదే అంశంపై చర్చించేందుకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు మరోమారు సమావేశం కావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్ తయారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల కేటాయింపులపై టీఎస్జీవో, టీజీవో విజ్ఞప్తి పై కేబినెట్ చర్చ జరిగింది.