
భారత్ లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సర హోలీ పండుగ వేడుకల్లో తాను పాల్గొనటంలేదని మోడీ వెల్లడించారు. కరోనా వైరస్ తో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, ఈ క్రమంలో సామూహిక సమావేశాలకు కూడా తాను హాజరుకావటంలేదని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
అంతేకాకుండా కరోనా భయం వెన్నాడుతున్న క్రమంలో ప్రజలు కూడా సామూహికంగా జరిగే కార్యక్రమాలను దూరంగా ఉండాలని మోడీ
సూచించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలంతా హోలీ వంటి వేడుకలకు దూరంగా ఉండాలని, బహిరంగ సమావేశాలను తగ్గించి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మోడీ తెలిపారు.
భారత్ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఇప్పటిదాకా 6 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా జైపూర్లో ఇటాలియన్ టారిస్ట్ కు వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అతడ్ని ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.