https://oktelugu.com/

PM Kisan Yojana: రైతుల అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. ఎన్ని? ఎలా సంప్రదించాలంటే?

అయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి విధితమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7500 రూపాయలను అందిస్తోంది. కేంద్రం అందించే సాయంతో కలిపి 13,500 అందిస్తున్నట్లు ఆర్భాటంగా చెబుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 9, 2023 / 05:34 PM IST

    PM Kisan Yojana

    Follow us on

    PM Kisan: కేంద్ర ప్రభుత్వం ఏటా వ్యవసాయానికి సాగు పెట్టుబడి కింద నగదు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశంలోని రైతులందరికీ యాట పెట్టుబడి సాయం అందిస్తోంది. ఏడాదికి 6000 చొప్పున 3 విడతల్లో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. నాలుగు నెలలకు ఓసారి రూ. 2000 చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పటివరకు 14 విడతల సాయం రైతు ఖాతాల్లో జమ చేసింది. 15వ విడత కోసం రైతులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

    అయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి విధితమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7500 రూపాయలను అందిస్తోంది. కేంద్రం అందించే సాయంతో కలిపి 13,500 అందిస్తున్నట్లు ఆర్భాటంగా చెబుతోంది.ఈ తరుణంలో కేంద్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. అదే సమయంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి ఏటా లబ్ధిదారుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం విశేషం. అనర్హులను జాబితాల నుంచి తొలగించేందుకు కేంద్రం పలు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే అర్హులైన లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేయాలని కోరుతోంది. ఇప్పటికే చాలామంది రైతులు ఈ కేవైసీ పూర్తి చేయగా.. ఇంకా చాలామంది పూర్తి చేయవలసి ఉంది. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేస్తారో ఆ రైతుల ఖాతాలోనే డబ్బులు పడతాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

    పీఎం కిసాన్ 15వ విడత డబ్బులు నవంబర్ 27న విడుదల కానున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. 14వ వి విడత డబ్బులు జూలై 27న విడుదలైన సంగతి తెలిసిందే. ఏటా ఏప్రిల్- జూలై మధ్య తొలి విడత, ఆగస్టు – నవంబర్లో రెండో విడత, డిసెంబర్- మార్చిలో మూడో విడత కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. ఇప్పటివరకు 14 విడతల్లో నగదు సాయం చేసింది. 15వ విడత కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.