Pushpa 2: సమంతను మించి.. పుష్ప2 ఐటెం సాంగ్ కోసం ఆ కత్తిలాంటి ఫిగర్ ను దించిన సుకుమార్

విడాకులైన వెంటనే నువ్వు ఐటమ్ సాంగ్ చేయడం సరికాదు. నీ గురించి అందరూ తప్పుగా భావిస్తారని సన్నిహితులు సలహా ఇచ్చారట. వారి మాటలు తోసిపుచ్చిన సమంత, నాగ చైతన్య మీద కసితో మరింత రెచ్చిపోయింది. పుష్ప చిత్రానికి సమంత ఐటెం సాంగ్ మైలురాయిగా నిలిచిన నేపథ్యంలో పుష్ప 2 చర్చకు వస్తుంది.

Written By: NARESH, Updated On : November 9, 2023 5:32 pm
Follow us on

Pushpa 2: పుష్ప సక్సెస్ క్రెడిట్ లో సమంతకు కూడా భాగం ఉంది. ఆమె చేసిన ఐటెం సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ‘ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ” సాంగ్ లో సమంత బోల్డ్ నెస్ కి తెరలేపింది. చిన్న ఫ్రాక్, బ్లౌజ్ ధరించి టెంప్టింగ్ ఫోజుల్లో సెగలు పుట్టించింది. అల్లు అర్జున్ తో ఆమె వేసిన స్టెప్స్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఈ సాంగ్ చేసే నాటికి సమంత విడాకులు తీసుకుని ఉంది.

విడాకులైన వెంటనే నువ్వు ఐటమ్ సాంగ్ చేయడం సరికాదు. నీ గురించి అందరూ తప్పుగా భావిస్తారని సన్నిహితులు సలహా ఇచ్చారట. వారి మాటలు తోసిపుచ్చిన సమంత, నాగ చైతన్య మీద కసితో మరింత రెచ్చిపోయింది. పుష్ప చిత్రానికి సమంత ఐటెం సాంగ్ మైలురాయిగా నిలిచిన నేపథ్యంలో పుష్ప 2 చర్చకు వస్తుంది. పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉందా లేదా? ఉంటే ఎవరు చేస్తున్నారనే? ఉత్కంఠ నెలకొంది. ఎంత బాగా చేసిన ఆల్రెడీ చేసిన సమంతను తీసుకుంటే కొత్తదనం ఉండదు.

అందుకే చాలా మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలించిన సుకుమార్ అలియా భట్ ని ఫైనల్ చేశాడట. ఆమె కూడా పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో పుష్ప 2లో అలియా భట్ ఐటెం భామగా అలరించనుందనే టాక్ నడుస్తుంది. బాలీవుడ్ భామ అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో రామ్ చరణ్ లవర్ గా ఆమె నటించారు.

దేవర చిత్రంలో ఆమె నటించాల్సి ఉండగా కొన్ని కారణాలతో కుదర్లేదు. సూపర్ హాట్ హీరోయిన్ అయిన అలియాతో అల్లు అర్జున్ ఐటెం సాంగ్ అదిరిపోవడం ఖాయం. ఇక పుష్ప చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అనసూయ, సునీల్. ఫహద్ ఫాజిల్ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.