https://oktelugu.com/

కేసీఆర్ ని వాడుకొని రేవంత్ ను దెబ్బకొట్టే ప్లాన్…? కాంగ్రెస్ నేత సరైన స్కెచ్?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అనే పేరు ఎత్తిత్తే ముందుగా వినపడేది రేవంత్ రెడ్డిదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడటం లో ఆయన శైలి చాలా స్పెషల్ గా ఉంటుంది. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన నాయకుడు. తనదైన శైలిలో దూకుడు రాజకీయానికి పెట్టింది పేరైన జగ్గారెడ్డి మాత్రం కెసిఆర్ విషయంపై కొద్దిగా సంశస్తున్నట్లు కనిపిస్తాడు. సీఎం పై ఎప్పుడు విరుచుకు పడతాడో ఎప్పుడు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 11, 2020 / 03:39 PM IST
    Follow us on

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ అనే పేరు ఎత్తిత్తే ముందుగా వినపడేది రేవంత్ రెడ్డిదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడటం లో ఆయన శైలి చాలా స్పెషల్ గా ఉంటుంది. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన నాయకుడు. తనదైన శైలిలో దూకుడు రాజకీయానికి పెట్టింది పేరైన జగ్గారెడ్డి మాత్రం కెసిఆర్ విషయంపై కొద్దిగా సంశస్తున్నట్లు కనిపిస్తాడు. సీఎం పై ఎప్పుడు విరుచుకు పడతాడో ఎప్పుడు విమర్శలు పక్కనపెట్టి ప్రశంసలు అందుకుంటారో ఎవరికీ తెలియని పరిస్థితి.

     

    ఈ సమయంలో రేవంత్ రెడ్డి కెసిఆర్ పై ఎంతగా కుదిరితే అంత ఒత్తిడి పెంచాలని ప్రయత్నిస్తుంటే…. జగ్గారెడ్డి వంటి నేతల సహాయం కరువు అవడమే కాకుండా అప్పుడప్పుడు అతనికి అడ్డుపడుతున్నాయి కూడా. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై రైతు బంధు పథకం వర్తింపు విషయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా పిసిసి పోస్ట్ కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలకు షాకిచ్చే కామెంట్లు చేస్తున్నారు.

    పీసీసీ చీఫ్ పదవి కోసం పెద్ద ఎత్తున సీనియర్ నేతలు బరిలో ఉన్నారు. టీపిసిసి అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని నియ్తమిస్తే తాను కూడా రేసులో ఉన్నట్టు బహిరంగంగానే చెబుతున్నాడు జగ్గా. తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ ప్రముఖులైన సోనియా, రాహుల్ గాంధీలని కోరుతూనే ఉన్నట్లు జగ్గారెడ్డి సెలవిచ్చారు. అయితే ఈ పోస్ట్ విషయంలో ఎంపీ రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి రేవంత్ ను సహజంగానే టార్గెట్ చేస్తారు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే అందుకు కేసీఆర్ ను అడ్డంపెట్టుకుని రాజకీయం నడిపే విధంగా జగ్గారెడ్డి టార్గెట్ చేస్తున్నాడు అని కొందరు ఆరోపిస్తున్నారు. మరి వారి వాదనలకు బలం చేకూర్చేలా జగ్గారెడ్డి చర్యలు ఉంటాయా లేదా అన్నది వేచి చూడాలి.