https://oktelugu.com/

సినిమాకు వంద కోట్లు.. దేశంలో ప్రభాస్ ఒక్కడే!

బాహుబలి తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ లైఫ్ మారిపోయింది. ఇప్పుడతను ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అగ్ర నటుల్లో ఒకడు. స్టార్డమ్‌లో అతను పాన్‌ ఇండియా హీరోగా మారాడు. పారితోషికం విషయంలోనూ ప్రభాస్‌ రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఇండియాలో వంద కోట్ల రూపాయలు తీసుకున్న తొలి హీరో ప్రభాసే అని తెలుస్తోంది. బాలీవుడ్‌ ఖాన్‌ త్రయం.. ఈ మధ్య హిందీ చిత్ర సీమను ఏలుతున్న అక్షయ్‌ కుమార్ ను మన డార్లింగ్‌ మించిపోయాడు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 11, 2020 / 03:25 PM IST
    Follow us on


    బాహుబలి తర్వాత యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ లైఫ్ మారిపోయింది. ఇప్పుడతను ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ అగ్ర నటుల్లో ఒకడు. స్టార్డమ్‌లో అతను పాన్‌ ఇండియా హీరోగా మారాడు. పారితోషికం విషయంలోనూ ప్రభాస్‌ రికార్డులు బద్దలు కొట్టేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఇండియాలో వంద కోట్ల రూపాయలు తీసుకున్న తొలి హీరో ప్రభాసే అని తెలుస్తోంది. బాలీవుడ్‌ ఖాన్‌ త్రయం.. ఈ మధ్య హిందీ చిత్ర సీమను ఏలుతున్న అక్షయ్‌ కుమార్ ను మన డార్లింగ్‌ మించిపోయాడు. నాగ్‌ అశ్విన్‌ సినిమా కోసం అతను వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. వైజయంతి మూవీస్‌ బ్యానర్పై అశ్వినీ దత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ‘రాధేశ్యామ్‌’ అనంతరం ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

    Also Read: Buzz: Is Nayantara offered to play villain?

    ‘మహానటి’తో దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నాగ్‌ అశ్విన్‌ ఇప్పటికే పూర్తి స్క్రిప్టు తయారు చేశాడు. సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపిక పడుకోన్‌ నటించనుంది. ఈ భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ కోసం ప్రభావం రూ. వంద కోట్లు తీసుకుంటున్నాడట. ఇందులో 70 కోట్లు రెమ్యునరేషన్‌ కాగా… 30 కోట్లు డబ్బింగ్‌ రైట్స్‌ కింద రెబల్‌ స్టార్ ఖాతాలో చేరనున్నాయి. ఈ విషయంలో సౌత్‌ సూపర్ స్టార్ రజినీకాంత్‌ ను ప్రభాస్‌ అధిగమించాడు. దర్బార్ సినిమా కోసం రజినీ అత్యధికంగా రూ. 70 కోట్లు పారితోషికం తీసుకున్నాడు. కానీ, ఇప్పుడు వంద కోట్ల క్లబ్‌లో చేరనున్న ప్రభాస్‌ దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా నిలవనున్నాడు.

    Also Read: Is Suriya ready to release his next on OTT?

    ప్రభాస్‌ ప్రస్తుతం రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రాధేశ్యామ్‌’పై దృష్టి పెట్టాడు. లాక్‌డౌన్‌ ముందు వరకు జార్జియాలో చిత్రీకరణలో పాల్గొన్నాడు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది. ఇప్పుడు రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేక సెట్‌ వేసి షూటింగ్‌ ప్రారంభించాలని చూస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌.