https://oktelugu.com/

బీజేపీ కరోనా వంటిది అయితే… వైసీపీ కి ఏ వ్యాధి పేరు పెట్టాలి నాని?

బిజెపిని రాజకీయ కరోనా గా వైసీపీ మంత్రి కొడాలి నాని అభివర్ణించిన తీరు ఇప్పుడు చాలా వివాదాస్పదం అయింది. ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ఈ రేంజ్ లో బిజెపి ని ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అయితే తన దుందుడుకు స్వభావానికి బాగా ఫేమస్ అయిన కొడాలి నాని మాత్రం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా బిజెపి కరోనా లాగా ప్రమాదకర పార్టీ అని అంటున్నాడు. ఇండియా లో పుట్టిన బిజెపి కరోనా…. పశ్చిమబెంగాల్ లో కమ్యూనిస్ట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 11, 2020 / 04:08 PM IST
    Follow us on

    బిజెపిని రాజకీయ కరోనా గా వైసీపీ మంత్రి కొడాలి నాని అభివర్ణించిన తీరు ఇప్పుడు చాలా వివాదాస్పదం అయింది. ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ఈ రేంజ్ లో బిజెపి ని ఎప్పుడు టార్గెట్ చేయలేదు. అయితే తన దుందుడుకు స్వభావానికి బాగా ఫేమస్ అయిన కొడాలి నాని మాత్రం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా బిజెపి కరోనా లాగా ప్రమాదకర పార్టీ అని అంటున్నాడు. ఇండియా లో పుట్టిన బిజెపి కరోనా…. పశ్చిమబెంగాల్ లో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ని కలిపి తినేస్తోందని…. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని, మరికొన్ని పార్టీలను ఫలహారం చేస్తోందని అన్నారు. ప్రస్తుతం టిడిపి కూడా ఈ కరోనా బారిన పడింది అని చెప్పుకొచ్చారు.

     

    మరి నాని అన్న మాటలకి ఇప్పుడు బీజేపీ నేతలు, సపోర్టర్లు తీవ్రమైన కౌంటర్ లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో నాని అసలు ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత లేదని అన్నారు. వైసిపి కన్నా రాష్ట్రాలను తినేసే రాజకీయ పార్టీ దేశంలోనే లేదని…. అమరావతి రైతుల భూములను నాశనం చేసిన ప్రమాదకర పార్టీ అని ఈ వైసీపీ నాయకుడి పైన భయంకరమైన ట్రోల్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జనసేన పార్టీకి ఉన్న ఒక్క సీటుకి కూడా ఎంతో నిస్సిగ్గుగా రాపాక ని తమ ఉచ్చులో బిగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటువంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు.

    ఇకపోతే మొదటి నుండి జనసేన-టిడిపికి కలిసి ఉంటున్నాయని తప్పుడు, ఆధారాలు లేని ప్రచారలతో ఎవరికీ ఓట్లు రానీయకుండా ఆ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకున్న వైసిపికి ఇప్పుడు పార్టీల నాశనం గురించి మాట్లాడే హక్కు ఎక్కడి నుండి వచ్చింది అది వారి వాదన. అంతేకాకుండా స్థానికల ఎన్నికల్లో నామినేషన్ సమయంలో వారు సృష్టించిన హింస, నేతలపై అక్రమ కేసులు పెడుతూ…. ప్రజలను పట్టించుకోకుండా తమ సొంత నిర్ణయాలతో అనైతికంగా రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఉండడం…. ఒక ఎలక్షన్ కమిషనర్ విషయంలో కోర్టులు చుట్టూ తిరిగి చివరికి అవమానం పాలై ఇప్పటికీ కక్షసాధింపు చర్యలను చేపడుతున్న వైసిపి పార్టీని కరోనా వ్యాధి కన్నా ఘోరంగా ఉండే ఏదైనా వ్యాధితో పోల్చాలి అని దుమ్మెత్తిపోస్తున్నారు. “మరి వీటన్నింటికీ కొడాలి నాని వద్ద సమాధానం ఉందా…?” అని కూడా అడుగుతున్నారు జనాలు.