2025 New Year Celebrations : సాధారణంగా పాత ఏడాదికి వీడ్కోలు పలికే సమయంలో మందు పార్టీ.. విందులు.. కేక్ కటింగ్ లు సర్వ సాధారణంగా ఉంటాయి.. అయితే ప్రతి ఏడాది ఇలానే చేస్తే బోరింగ్ లాగా ఉంటుంది. అయితే ఈసారి సరికొత్తగా ప్లాన్ చేయండి.. ఈ ప్రాంతాలకు వెళ్తే మీకు జీవితకాలపు అనుభూతి కచ్చితంగా లభిస్తుంది.. ప్రాంతాలు అనగానే ఎక్కడో విదేశాలు అనుకోకండి.. మనదేశంలోనే.. జస్ట్ ఫ్లైట్ ఎక్కి దిగి వెళ్లేంత దూరంలోనే ఉన్నాయి.. ఇంతకీ ఆ ప్రాంతాలు ఏంటంటే..

అదరగొట్టే షిల్లాంగ్
మనదేశంలో ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు రాజధాని ఈ ప్రాంతం. ఇక్కడ పూర్తి పాశ్చాత్య సంస్కృతి ఉంటుంది. నూతన సంవత్సర వేడుకలు ఇక్కడ వెస్ట్రన్ కల్చర్ లో జరుగుతుంటాయి.. చెవులకు ఆనందాన్ని కలిగించే సంగీతం.. అదరగొట్టే నైట్ లైఫ్.. ఆకట్టుకుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఇక్కడికి మాత్రమే పరిమిత ఖాసీ సంస్కృతిని దగ్గరుండి చూడొచ్చు. ఈసారి మేఘాలయ ప్రభుత్వం అధికారికంగా నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి సంగీత ప్రదర్శనలు నిర్వహిస్తోంది.
గో గోవా..
గోవా.. ఈ పేరు మదిలో మెదలగానే ఒంట్లో ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. బీచ్ లు, రిసార్ట్ లు, మసాజ్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడి అద్భుతాలకు లెక్కే ఉండదు. ప్రతిరోజు ఇక్కడ పార్టీలో జరుగుతూనే ఉంటాయి. అలాంటిది సంవత్సరం ముగింపు వేడుకలు అంటే ఇక్కడ మామూలుగా ఉండదు. బగా, ఆంజున, కలంగుటే బీచ్ లు ప్రత్యేకంగా ఉంటాయి. ఏడాది ప్రారంభ వేడుకలను దృష్టిలో పెట్టుకొని స్టార్ గాయకులతో మ్యూజిక్ పార్టీలను నిర్వహిస్తున్నారు..
New Year 2024 Celebrations midnight by common Indians at Lalchowk, Srinagar, Kashmir with the historic clock tower illuminated in Tiranga lights. pic.twitter.com/AjqVcORxwn
— Frontalforce (@FrontalForce) January 1, 2024
డార్జిలింగ్
యువతలో.. ఉత్సాహానికి ప్రతీక లాంటి వాళ్ళు మాత్రమే కాదు.. నిశ్శబ్దంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ప్రకృతి ఒడిలో హాయిగా గడిపే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారు పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతంలో జరిగే నూతన సంవత్సర వేడుకలకు హాజరు కావచ్చు. ఆ తర్వాత తేయాకు తోటల్లో తిరుగుతూ ప్రకృతి రమణీయతను ఆస్వాదించవచ్చు.

అండమాన్ దీవులలో
పగడపు దీవులకు పేరుపొందిన అండమాన్ దీవులలో నూతన సంవత్సర వేడుకలు ఆకాశాన్ని అంటుతాయి. ఇక్కడ పార్టీలు, బీచ్ లు పూర్తి పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. హావ్ లాక్, ఐస్ ల్యాండ్, రాధానగర్ బీచ్ లు ఆకట్టుకుంటాయి.
Goa night pic.twitter.com/htbph7Uz7p
— Hyderabadi $@! (@follow_sai) December 27, 2024
ఆధ్యాత్మికంగా
పార్టీ కల్చర్ నచ్చని వారు ఆధ్యాత్మికంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు. అయితే ఈసారి రిషికేష్ ప్రాంతంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గంగా హారతి నిర్వహించనున్నారు. ఆ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యి.. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని రిషికేష్ వెళ్లొచ్చు.
మనాలి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనాలి ప్రాంతంలో హిల్ స్టేషన్ లలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం సరికొత్త అనుభూతి. అక్కడి ప్రభుత్వం హిల్ స్టేషన్లను సరికొత్తగా రూపొందించింది. పర్యాటకుల కోసం అక్కడ కొత్తగా కెఫెలు, రెస్టారెంట్ కూడా ఏర్పాటయ్యాయి. చల్లగాలులను, మంచును ఆస్వాదిస్తూ అక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవచ్చు.