Homeఆంధ్రప్రదేశ్‌Sarath Chandra Reddy TTD: బోర్డులోకి లిక్కర్ స్కాం శరత్.. వైసీపీ రాజకీయ అవసరాలు తీర్చేస్తున్న...

Sarath Chandra Reddy TTD: బోర్డులోకి లిక్కర్ స్కాం శరత్.. వైసీపీ రాజకీయ అవసరాలు తీర్చేస్తున్న టీటీడీ?

Sarath Chandra Reddy TTD: తిరుమల తిరుపతి దేవస్థానం అధికార వైఎస్ఆర్సిపికి రాజకీయ అవసరాలు తీర్చే వస్తువుగా మారింది. ఇప్పటికే టిటిడి బోర్డు చైర్మన్ గా వివాదాస్పద భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. తాజాగా మరొక అడుగు ముందుకేసింది. ఈ బోర్డులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న శరత్ చంద్రారెడ్డికి స్థానం కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డి సతీమణి కూడా ఇందులో చోటు దక్కింది.

సుదీర్ఘకాలం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బోర్డు సభ్యులను నియమించారు. మొత్తం 24 మంది సభ్యుల్లో ఏడుగురికి మళ్ళీ అవకాశం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఈ నెల 10న బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 15 రోజులకు పాలకమండలి సభ్యులను ప్రభుత్వం ఖరారు చేసింది. అందరూ ఊహించిన విధంగానే తనకు వివిధ కోణాల్లో ఉపయోగపడుతున్న వారికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. ఎవరేమనుకుంటే ఏంటి అనేతీరుగా తనకు పనికొచ్చే వాళ్లకే అవకాశం కల్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు, ఒక అప్రూవర్ గా మారిన పెనక చంద్రారెడ్డికి తిరుమల తిరుపతి స్థానం బోర్డులో స్థానం కల్పించారు. ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడికి కావడం విశేషం. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన వారికి ఈ బోర్డులో స్థానం దక్కడం విశేషం. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి చెందిన నలుగురికి జగన్ స్థానం కల్పించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన డాక్టర్ శంకర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో స్థానం కల్పించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈయన అత్యంత సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ఇతడికి రెండోసారి అవకాశం దక్కింది. అలాగే హైకోర్టు న్యాయవాది కృష్ణమూర్తి వైద్యనాథన్ కు చోటు కల్పించారు. డ్రైవర్గాల్లో ఆయనకు మంచి పట్టు ఉందని సమాచారం. అంతేకాకుండా కృష్ణమూర్తి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. ఆయనకు టిటిడి బోర్డు సభ్యుడుగా పదవి దక్కడం ఇది నాలుగోసారి. టిసిఎస్ వేణు కుమారుడు సుదర్మన్ వేణు కు కూడా స్థానం లభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు సన్నిహితుడైన బాలసుబ్రహ్మణ్యం ఫళని స్వామికి కూడా టిటిడి బోర్డులో స్థానం దక్కింది. మహారాష్ట్రలో శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కార్యదర్శి మిలింద్ నర్వేకర్ ను కూడా టిటిడి బోర్డు సభ్యుడుగా నిర్మించారు. ఈయనకు ఈ పదవి లభించడం ఇది రెండవసారి. రాష్ట్ర ప్రాంతానికి చెందిన సౌరబ్ కు మరోసారి స్థానం కల్పించారు. ఇదే రాష్ట్రానికి చెందిన అమోల్ కాలే గతంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండగా.. ఈసారి బోర్డులో సభ్యత్వం కల్పించారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన డాక్టర్ కేతన్ కు మరోసారి బోర్డులో చోటు కల్పించారు. ఈయన ఒక యూరాలజిస్ట్. 2001లో అప్పటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పదవి కోల్పోయారు. కర్ణాటక నుంచి వీఆర్ దేశ్ పాండేకు బోర్డులో స్థానం కల్పించారు. తెలంగాణ ప్రాంతం నుంచి చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి సీతా రెడ్డికి బోర్డు సభ్యురాలుగా స్థానం కల్పించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, ముమ్మిడివరం ఎమ్మెల్యే వెంకట సతీష్ కుమార్, మడకశిర ఎమ్మెల్యే తిప్పే స్వామికి ఈ అవకాశం లభించింది. ఇంకా సిద్ధవటం యానాదయ్య, మేక శేషుబాబు, అశ్వర్ధ నాయక్, వెంకటసుబ్బారెడ్డి, సీతారామరెడ్డి, వెంకట సుబ్బరాజు, సిద్ధ వీర వెంకట సుధీర్ కుమార్, నాగ సత్యం, సామల రామిరెడ్డి, గడ్డం సీతారెడ్డి లను బోర్డులో నియమించారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular