spot_img
Homeజాతీయ వార్తలుPetrol Diesel shortage news: ఇదేం చోద్యం.. బకెట్లు, క్యాన్లు, కుక్కర్లలో నింపుకెళుతున్నారు..

Petrol Diesel shortage news: ఇదేం చోద్యం.. బకెట్లు, క్యాన్లు, కుక్కర్లలో నింపుకెళుతున్నారు..

Petrol Diesel shortage news: పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. పాకిస్తాన్‌లో పెట్రోల్‌ ధరలు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రిపబ్లిక్‌డే వేడుకలను రద్దు చేసింది. బంగ్లాదేశ్, శ్రీలంకలోనూ ఇదేపరిస్థితి. భారత్‌లో వంటగ్యాస్‌ ధరలు పెరిగాయి. ఇక రెండు రోజులుగా పెట్రోల్‌ కొరత వస్తుందన్న వదంతోలతో బంకుల వద్దకు జనం పరుగులు పెడుతున్నారు. బారులుతీరి వాహనాల్లో ఫుల్‌ ట్యాంక్‌ చేసుకుంటున్నారు. అధికారులు కొరత లేదని చెబుతున్నా వాహనాల్లో నింపుకోవడంతోపాటు బాటిళ్లు, క్యాన్లలో తీసుకెళ్తున్నారు. గుజరాత్‌లో అయితే కనీ విని ఎరుగనిరీతిలో గిన్నెలు, కుక్కర్లు, బకెట్లలో కూడా పెట్రోల్‌ తీసుకెళ్తున్నారు.

యుద్ధ భయాలతోనే..
మధ్యప్రాచ్య యుద్ధాలు, చమురు ధరల పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో అమ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదరాలో సోషల్‌ మీడియా వదంతులు వేగంగా వ్యాపించాయి. పెట్రోల్‌ బంకుల వద్ద కిలోమీటర్ల క్యూలు, ట్రాఫిక్‌ జామ్‌లు, ఆగ్రహాలు ఏర్పడ్డాయి. అధికారులు సరఫరా స్థిరంగా ఉందని, డీలర్లకు క్రెడిట్‌ సమస్యలు మాత్రమే కారణమని చెబుతున్నారు.

విచిత్రంగా నిల్వలు..
రాబోయే రోజుల్లో పెట్రోల్‌ డీజిల్‌ దొరకకపోతే ఇబ్బంది పడతామని చాలా మంది విచిత్రంగా పెట్రోల్‌ను బంకుల నుంచి తరలించి నిల్వ చేసుకుంటన్నారు. పబ్లిక్‌ టాప్‌ల నుంచి నీళ్లు మోసుకెళ్తున్నట్లుగా కుక్కర్లు, బకెట్లు, మిల్క్‌ క్యాన్లు, వాటర్‌ ట్యాంకర్లు, డ్రమ్ముల్లో పెట్రోల్‌ కొట్టించుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అల్యూమినియం కుక్కర్లు ఇంధనంతో సంపర్కం జరిగితే పేలుడు జరుగుతుంది. అదే గిన్నెల్లో వంట చేస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. హైదరాబాద్‌లో కూడా క్యాన్లలో పెట్రోల్, డీజిల్‌ తీసుకెళ్తున్నారు.

అధిక కొనుగోలుతో ఇబ్బందులు..
ఇలాంటి పానిక్‌ భయాలతో అవసరానికి మించి కొనుగోలు చేయడం వలన నిజమైన సరఫరా దెబ్బతీస్తుంది. బంకులు తాత్కాలికంగా ఖాళీ అవుతాయి. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో ఆటోలు, టూ–వీలర్లు క్యూలలో ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ప్రభుత్వం, పెట్రోల్‌ డీలర్‌ సంఘాలు తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరుతున్నా జనం పట్టించుకోవడం లేదు.

వదంతులకు ఎదుర్కొనేందుకు ఎస్‌ఎంఎస్‌ అలర్టులు, హెల్ప్‌లైన్‌లు, సరఫరా స్థిరత్వ హామీలు అవసరం. వాహనదారులు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలి. ఇక నిల్వకు భద్రమైన కంటైనర్లు ఉపయోగించాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version