Homeబిజినెస్Xiaomi SU7 Electric Car: Xiaomi నుంచి హై టెక్నాలజీ కారు.. ధర చూస్తే దిమ్మతిరుగుద్ది..

Xiaomi SU7 Electric Car: Xiaomi నుంచి హై టెక్నాలజీ కారు.. ధర చూస్తే దిమ్మతిరుగుద్ది..

Xiaomi SU7 Electric Car: చైనా కంపెనీ Xiaomi ఇటీవల కొత్త కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఎలక్ట్రిక్ వాహనం SU 7 సిరీస్ అప్డేట్ లో భాగంగా ఈ కొత్త కారు బ్యాటరీని మెరుగుపరుచుకున్నట్లు తెలుస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 902 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో డ్యూయల్ చిప్ సెటప్ తో పని చేసే స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3, అసిస్టెడ్ డ్రైవింగ్ కోసం Nvidia drive AGX Thore ప్రత్యేకంగా చేర్చారు. ధర కూడా అందుబాటులోనే ఉండడంతో దీనిపై ఆసక్తి పెరిగింది. దీని గురించి పూర్తి వివరాలు లోకి వెళితే..

ప్రస్తుతం చైనాలో కొత్త తరం Xiaomi SU 7 కారు గురించే జోరుగా చర్చ సాగుతోంది. ఈ కారు 5 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు వీల్ బేస్ ను కలిగి ఉంది. ఇందులో హెడ్లైట్లతో సహా టెయిల్ లైట్స్ అంటే సిగ్నేచర్ డిజైన్ పాత కారు కంటే ఇది కొత్తగా కనిపిస్తుంది. దీనికి ఉండే ఏరోడ్ డైనమిక్స్ డిజైన్, సెన్సింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ రాడార్, రీ డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్ కారుకు ప్రీమియం లుక్ ను అందిస్తుంది. ఈ కారులో డ్యూయల్ చిప్ సెటప్ తో అమర్చబడింది. స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ 3 SoC ఇన్ క్యాబిన్ కంప్యూటింగ్ కు పూర్తిగా భద్రతను అందిస్తుంది. ఇందులో ఉండే Nvidia drive AGX Thore ఫీచర్ వెహికల్ కంప్యూటింగ్ అసిస్టెడ్ డ్రైవర్లకు పూర్తిగా సపోర్టును అందిస్తుంది. AI వాయిస్ ఉండడంతో అవసరమైన సౌకర్యాలను పొందవచ్చు. ఇన్నర్ క్యాబిన్లో మొత్తం ఆరు స్క్రీన్ లను చూడవచ్చు. రిమోట్ కంట్రోల్ ప్యానెల్ కూడా కారును నియంత్రించే భాగంలో ఉంటుంది.

ఈ కొత్త కారు హైపర్ ఇంజన్ V6S ప్లస్ మోటార్ తో పనిచేస్తుంది. ఈ మోటార్ జీరో నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 3.08 సెకండ్లలోని అందుకుంటుంది. అంతేకాకుండా గంటకు 265 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 902 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ కారులో సెల్ టు బాడీ బ్యాటరీ ఉండడంతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ బ్యాటరీ 15 నిమిషాల్లోనే 80% పూర్తవుతుంది. అందులో మొత్తం తొమ్మిది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. చాసిస్ అత్యధికంగా సెక్యూరిటీని ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కారును ప్రస్తుతం మార్కెట్లో CNY 219,00 (రూ.30 లక్షలు) ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ CNY 303,900(రూ.41 లక్షలు) గా ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version