https://oktelugu.com/

Jagan On MLAs: వ్యతిరేకత ఎమ్మెల్యేలకు.. అధికారం జగన్ కా?

Jagan On MLAs: పనిచేయ్..ప్రతిఫలం ఆశించకు అన్న చందంగా ఉంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరు.. విధులు అప్పగించరు. కానీ జనాల్లోకి వెళ్లమంటున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను, సంక్షేమాన్ని చెప్పమంటున్నారు. తీరా జనాల్లోకి వెళితే మీకు సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారంటే వలంటీర్లని ప్రజలు బదులిస్తుండడంతో కంగుతింటున్నారు. ప్రజలు సంక్షేమంతో సంత్రుప్తి పడకుండా సామాజిక అవసరాలు ఏవంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖం మీద తలుపులు వేసి ఇళ్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు […]

Written By:
  • Dharma
  • , Updated On : June 9, 2022 12:52 pm
    Follow us on

    Jagan On MLAs: పనిచేయ్..ప్రతిఫలం ఆశించకు అన్న చందంగా ఉంది ఏపీ సీఎం జగన్ పరిస్థితి. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరు.. విధులు అప్పగించరు. కానీ జనాల్లోకి వెళ్లమంటున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను, సంక్షేమాన్ని చెప్పమంటున్నారు. తీరా జనాల్లోకి వెళితే మీకు సంక్షేమ పథకాలు ఎవరు ఇస్తున్నారంటే వలంటీర్లని ప్రజలు బదులిస్తుండడంతో కంగుతింటున్నారు. ప్రజలు సంక్షేమంతో సంత్రుప్తి పడకుండా సామాజిక అవసరాలు ఏవంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖం మీద తలుపులు వేసి ఇళ్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి మారింది. ఓ వైపు ప్రభుత్వం పనితీరు నాసిరకంగా ఉందని కనీస సౌకర్యాల కోసం ప్రజలు డిమాండ్ చేస్తూంటే… అటు సీఎం జగన్ మాత్రం అవేమీ మాట్లాడటం లేదు. కనీసం వినిపించుకోవడం లేదు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని మారకుండా మార్చేస్తానని హెచ్చరిస్తున్నారు. అసలు తామేమీ చేయడానికి లేదని.. చేయలేకపోతున్నామని.. నిధుల్లేక.. వాలంటీర్లు, వార్డు సెక్రటరీలే పథకాల ప్రచారం చేసుకుంటూ ఉంటే.. తామేం చేస్తామని వారు లబోదిబోమంటున్నారు. అయితే ఇలాంటి కారణాలను జగన్ వినదల్చుకోలేదు. అయితే ఆయన ప్రజా వ్యతిరేకతకు ఎమ్మెల్యేలే కారణం అని వారిని బలిచ్చి.. టార్గెట్ రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వారిలో వినిపిస్తోంది.

    Jagan On MLAs

    Jagan

    ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికీ ఏటా రూ.2 కోట్ల అభివృద్ధి నిధులు చేస్తానని గత మార్చి 15వ తేదీన జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎంజగన్‌ ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాల సమయంలో చేసిన ఈ ప్రకటన తక్షణమే అమల్లోకి వస్తుందని పాలకపక్ష ఎమ్మెల్యేలు ఆశించారు. కానీ 85 రోజులైనా ఎలాంటి ఉత్తర్వూ జారీ కాలేదు. ఈ నిధులొస్తే గడప గడపకు కార్యక్రమంలో నిరసనలు ఎదుర్కోవలసి వచ్చేది కాదని అధికార ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

    Also Read: Janasena Compete Alone: జనసేన ఒంటరి పోటీనే ఖాయమవుతోందా?

    నేను చెప్పిందే వినండి..
    వైసీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు వర్క్ షాపు నిర్వహిస్తున్నట్టు సమాచారమిచ్చారు. పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు సందేహాలను నివ్రుత్తి చేస్తామని చెప్పకొచ్చారు. కానీ సమావేశం మొత్తం అధినేత జగన్ చెప్పింది వినడమే తప్పించి గట్టిగా తమ సమస్యలను అడిగే అవకాశం లేకుండా పోయిందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. అటువంటప్పుడు వర్క్ షాపు పెట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొంత మందికి చాన్స్ ఇస్తే వారు నేరుగా ప్రభుత్వ వైపు ఉన్న తప్పిదాలను ప్రశ్నించారు. అయితే ఆ తప్పులను నిజం అని ఒప్పుకోవడానికి జగన్ అంగీకరించలేదు. అదంతా మీడియా ప్రచారం అని తేలికగా తీసుకోవడమే కాదు.. ఆ సమస్యలు లెవనెత్తిన ఎమ్మెల్యేలను కసురుకున్నారు. దీంతో ఇతర ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు. కొందరు సీనియర్లకు వాస్తవం తెలిసినా ప్రస్తావించడానికి మొగ్గుచూపలేదు. మునిగితే అందరం మునుగుతాం.. కానీ సమస్యలు ప్రస్తావించి అధినేత ముందు పలుచనవడం ఎందుకుని మిన్నకుండా ఉండిపోతున్నారు.

    Jagan On MLAs

    Jagan

    ఎమ్మెల్యేలకు అవకాశమేదీ?
    తమకు నియోజకవర్గాల్లో ఎదురవుతున్న నిలదీతలు, ప్రశ్నల గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తే..సీఎం జగన్ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. బిల్లులు రావడం లేదని.. నీళ్లు.. రోడ్ల కోసం తంటాలు పడుతున్నారని… సంక్షేమ పథకాల్లో లబ్దిదారులకు కోత విధిస్తున్నారని ఇలా అనేక రకాలుగా ఎమ్మెల్యేలు సమస్యలు చెప్తే.. అవన్నీ జగన్ తీసి పడేస్తున్నారు. వాటన్నింటికీ నవరత్నాల్లో నిధులు కేటాయిస్తున్నాముగా.. అంటూ తేలిగ్గా తీసుకుంటున్నారు. అధినేత తీరును చూసి ఎమ్మెల్యేలు ఆశ్చర్యపోయారు. వాటిపైనే తమను నిలదీస్తూంటే.. అవేమీ సాధ్యం కాదని జగన్ చెప్పడంతో తాము ప్రజలకు ఏమి చెప్పుకోవాలన్న డైలామాలో వారు పడిపోయారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు.. ఇంకా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇలా అనేక అంశాలపై జగన్‌ది దబాయింపే కానీ.. సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నం చేయలేదు. తనపై ప్రజలకు మంచి నమ్మకమే ఉందని.. మీపైనే లేదంటూ ఎమ్మెల్యేలపై నెట్టేయడంపై నేతలు మధనపడుతున్నారు. తమ వైపు నుంచి మార్చుకోవడానికి ఏముందని ప్రశ్నిస్తున్నారు.. సమస్య అంతా ప్రభుత్వం వైపు నుంచే ఉందని.. తాము ఎంత ప్రజలకు అందుబాటులో ఉన్నా.. ప్రజలు అడిగిన పనులను ప్రభుత్వం చేయకపోతే ఎలా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. తప్పంతా ప్రభుత్వానిది అయితే తమను నిందిస్తారేమిటని ఎమ్మెల్యే లోపల అనుకుంటున్నారు కానీ బయటపడలేకపోతున్నారు. తమను వ్యూహం ప్రకారం బలిపశువుల్ని చేస్తున్నారని అనుకుంటున్నారు.

    Also Read:Anam Ramanarayana Reddy: ‘ఆత్మకూరు’లో ఆచూకీ లేని ఆనం.. హైకమాండే దూరం పెట్టిందా?

    Tags