Homeఎంటర్టైన్మెంట్NTR Koratala Movie: ఎన్టీఆర్ - కొరటాల సినిమాలో మరో స్టార్ హీరో

NTR Koratala Movie: ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో మరో స్టార్ హీరో

NTR Koratala Movie: మెగాస్టార్ చిరంజీవి తో తీసిన ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..#RRR వంటి సెన్సషనల్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై ఆచార్య ఫ్లాప్ ప్రభావం ట్రేడ్ సర్కిల్స్ లో ఏ మాత్రం పడలేదు..ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్బంగా విడుదల చేసిన మోషన్ టీజర్ కూడా అదిరిపోవడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాకుండా, ప్రేక్షకుల్లో కూడా అంచనాలు మొదలు అయ్యాయి..తమిళ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు..ఇటీవల కాలం లో ఈయన సంగీత సారథ్యం లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..సినిమాలో కంటెంట్ లేకపోయినా కూడా అనిరుధ్ తన మ్యూజిక్ తో తమిళ్ లో బ్లాక్ బస్టర్ ని చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి..ఆ అంశం కూడా ఈ కాంబినేషన్ పై అంచనాలు పెంచడం లో ఒక్క కారణం అని చెప్పొచ్చు.

NTR Koratala Movie
Anuridh

ఇక ఆచార్య ఫలితం ని చూసిన తర్వాత కొరటాల శివ స్క్రిప్ట్ మీద ఇప్పటికే మూడు సార్లు రీ వర్క్ చేసినట్టు సమాచారం..జూనియర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ పట్ల ఎంతో నమ్మకం ఉంది..షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్పినప్పటికీ కూడా కొరటాల శివ రిస్క్ తీసుకోవడానికి సిద్ధం గా లేదు..కత్తిని బాగా సానపెట్టినట్టు, కొరటాల శివ ఈ స్క్రిప్ట్ ని బాగా సానబెడుతున్నాడు..సాధారణంగా ఒక్క డైరెక్టర్ ఫ్లాప్స్ లో ఉంటే అతనితో సినిమాలు చెయ్యడానికి ఇప్పుడు ఉన్న ఏ స్టార్ హీరో కూడా రిస్క్ తీసుకోదు..కానీ ఎన్టీఆర్ రిస్క్ తీసుకొని అవకాశం ఇవ్వడం తో ఎలా అయినా ఎన్టీఆర్ కెరీర్ లో చిరస్థాయిగా గుర్తు ఉండిపొయ్యే బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అనే కసి తో స్క్రిప్ట్ దగ్గర నుండి కాస్టింగ్ వరుకు ఎక్కడ కూడా తగ్గడం లేదు కొరటాల శివ..మరో లేటెస్ట్ వార్త ఏమిటి అంటే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ని కూడా ఒక్క భాగం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు అట కొరటాల శివ.

NTR Koratala Movie
Mahesh, Siva Koratala

Also Read: Pawan Kalyan Tweets: జనసేన సైనికులారా జరభద్రం… పవన్ ట్విట్ల వెనుక కథ ఇదా?

మహేష్ బాబు మరియు కొరటాల శివ కి మధ్య ఎంతో సన్నిహిత్య సంబంధం ఉంది..ఎందుకంటే మహేష్ కెరీర్ లో శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను వంటి గుర్తుండిపోయ్యే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు కొరటాల శివ..తనకి రెండు తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కొరటాల శివ కి మహేష్ బాబు ఎలాంటి సహాయం చెయ్యడానికి కూడా వెనుకాడడు..ఆచార్య సినిమాకి కూడా అడగగానే వాయిస్ ఓవర్ ఇచ్చాడు మహేష్ బాబు..అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ తో తియ్యబోతున్న సినిమాకి కూడా వాయిస్ ఓవర్ ఇప్పించబోతున్నాడు కొరటాల శివ..ఇక హీరోయిన్ విషయం లో కొరటాల శివ ఇప్పటికి తర్జన భర్జన పడుతూనే ఉన్నాడు ..ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ని అనుకున్నప్పటికీ ఆమె ఎందుకో చివరి నిమిషం లో నేను ఈ సినిమాలో చెయ్యడం లేదు అని తప్పుకుంది..ఆ తర్వాత కైరా అద్వానీ కోసం ప్రయత్నం చేసారు..ఆమె కూడా నో చెప్పింది..అయినా కూడా పట్టు వదలకుండా బాలీవుడ్ హీరోయిన్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడట కొరటాల శివ..పాన్ ఇండియా సినిమా కావడం తో కచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్ ఉంటే సినిమాకి చాలా ఉపయోగం పడుతుంది అని కొరటాల శివ గట్టి నమ్మకం..ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్.

Also Read: Mekapati Family: మేకపాటి కుటుంబంలో వేరు కుంపట్లు.. ఆసక్తిగా ఆత్మకూరు ఉప ఎన్నికలు

Ram Charan Hard GYM Workout For #RC15 || Ram Charan Latest Gym Video || Shankar Movie Updates

 

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version