Ballaya Vs Star Heroine: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గారి ఊపు మాములుగా లేదు అనే చెప్పాలి..గత ఏడాది డిసెంబర్ నెలలో బోయపాటి శ్రీను తో ఆయన చేసిన అఖండ సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కరోనా కి భయపడి థియేటర్స్ కి రావడానికి ఆలోచిస్తున్న ప్రేక్షకులను థియేటర్స్ కి బారులు తీసేలా చేసాడు బాలయ్య బాబు..ఈ సినిమా తర్వాత ఆయన తొలిసారిగా వ్యాఖ్యాతగా మారి ఆహా మీడియా లో చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ అనే ప్రోగ్రాం కూడా భారీ హిట్ అయ్యి బాలయ్య లోని మరో కోణాన్ని మన అందరికి పరిచయం అయ్యేలా చేసింది..ఇలా బాలయ్య బాబు పట్టిందల్లా బంగారమే అయిపోతున్న ఈ తరుణం లో ఆయన భవిష్యత్తులో చెయ్యబొయ్యే సినిమాలు మీద కూడా అభిమానులు ఎంతో సంతృప్తి చెందుతున్నారు..గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు ఒప్పుకొని కెరీర్ లో చాలా కాలం తర్వాత మా హీరో పీక్ స్థానం లోకి వచేసాడు అనే ఫీలింగ్ ని నమ్మకం ని నందమూరి అభిమానుల్లో నింపాడు బాలయ్య.

Also Read: Chandrababu- 2024 Elections: రెండేళ్లు.. అధికారం కోసం చంద్రబాబు వేసిన ప్లాన్ ఇదీ!
ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని తో చేస్తున్న సినిమా శెరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుండగా..అతి త్వరలోనే అనిల్ రావిపూడి తెరకెక్కించబోయ్యే సినిమా లో పాల్గొనబోతున్నారు బాలయ్య..ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ఈ సినిమాలో బాలయ్య బాబు కి జోడిగా ప్రియమణి నటిస్తుండగా, ఆయన కూతురుగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల నటించబోతుంది అట..అయితే ఈ సినిమా లో ఒక్క పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ ఉంది అట..ఈ పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరోయిన్ అంజలి ని తీసుకున్నాడట అనిల్ రావిపూడి..బాలకృష్ణ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే లేడీ విలన్ రోల్ లో అంజలి కనిపిసిమ్హబోతున్నట్టు సమాచారం..గతం లో బాలయ్య బాబు హీరో గా నటించిన డిక్టేటర్ సినిమాలో అంజలి హీరోయిన్ గా నటించింది..మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండవ సినిమా ఇది..ఇప్పటి వరుకు కెరీర్ లో సాఫ్ట్ రోల్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న అంజలి తొలిసారి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో చేస్తుంది..ఈ పాత్రలో ఆమె ఎలా అలరిస్తుందో చూడాలి.

Also Read: Somu Veerraju: సోము వీర్రాజుపై కేసు.. కారణం అదేనట? అర్ధరాత్రి అరెస్ట్ కు ప్లాన్?



[…] Also Read: Ballaya Vs Star Heroine: బాలయ్య కి వెన్నుపోటు పొడిచి… […]
[…] Also Read: Ballaya Vs Star Heroine: బాలయ్య కి వెన్నుపోటు పొడిచి… […]