GST increase: ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చిన సామాన్యుడు, మధ్యతరగతి ప్రజల నడ్డివిరడమే పనిగా పెట్టుకున్నట్లు కన్పిస్తున్నాయి. కరోనాతో దేశంలోని ప్రజలంతా ఉపాధి కోల్పోయి నానాసంకలు నాకుతుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల పేరిట భారం మోపుతూ ఖజనా నింపుకునే ప్రయత్నం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

సంక్షేమ కార్యక్రమాల పేరిట ప్రజల నుంచి దోచుకున్న డబ్బునే తిరిగి ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. అయితే సమయం, సందర్భం లేకుండా ఇష్టారీతిన ప్రభుత్వాలు పన్నులు పెంచుకుంటూ పోతుండటం సామాన్యుడి జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి జీవనం రోజురోజుకు దయనీయంగా మారుతున్నాయి.
ఇప్పటికే కేంద్ర సర్కారు పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడంతో ఆ ప్రభావం ప్రతీ వస్తువుపై పడింది. దీంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డునపడిన సయంలోనూ.. ప్రభుత్వాలు అందిక కాడికి దోచుకోవడమే లక్ష్యంగా పన్నులు పెంచుతుండటం శోచనీయంగా మారింది.
ప్రతీఒక్కరికి కూడు, గుడ్డ, నివాసం తప్పనిసరి. ఇలాంటి నిత్యావర వస్తువు అయిన దుస్తులపై ఇప్పుడు కేంద్రం కన్ను పడింది. ఇప్పటి వరకు దుస్తులపై 5శాతం ఉన్న జీఎస్టీనీ ఇకపై 12శాతానికి పెంచేందుకు కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. అంటే ఒక వ్యక్తి వెయ్యి రూపాయాల దుస్తులను ఖరీదు చేస్తే అదనంగా జీఎస్టీ పేరిట 120 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 1120 రూపాయలు అన్నమాట.
నూతన సంవత్సర కానుకగా కేంద్రం జనవరి 1 నుంచి దీనిని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేయడం విశేషం. అయితే ప్రభుత్వాలు ఉన్నది కేవలం పన్నులు పెంచేందుకేనా? అన్న ప్రశ్నలు సామాన్యుల నుంచి విన్పిస్తుంది. పన్నుల పెంచేందుకు వేళపాళ లేదా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.
Also Read: హక్కుల పేరిట అమెరికా అత్యుత్సాహం..!
ఇల్లు గడవడమే కష్టంగా మారిన సమయంలో సామాన్యుడి ఒంటిపై బట్టలకు కూడా దిక్కు లేకుండా చేస్తారా? అని ప్రతిపక్ష పార్టీలు విమర్శలకు దిగుతున్నాయి. పన్నులు వసూలు చేయడమే అభివృద్ధా? అంటూ గట్టిగా నిలదీస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇప్పటికే కేంద్రంపై వ్యతిరేకత రాగా మరో వడ్డింపునకు కేంద్రం సిద్ధమవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ విషయంలో కేంద్రం పునరాలోచించి మునుపటి లాగే ఐదుశాతం జీఎస్టీని అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీల నుంచి డిమాండ్స్ విన్పిస్తున్నాయి. కరోనా సమయంలో దుస్తులపై పన్నులను పెంచడం సరికాదని సూచిస్తున్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
Also Read: దేశాన్ని ఒమిక్రాన్ వైరస్ కమ్మేస్తోందా? 3వ వేవ్ తప్పదా?