https://oktelugu.com/

ఉత్సాహంగా రోడ్లపైకి!

కరోనా భయంతో లాక్ డౌన్ కారణంగా 55 రోజులుగా ఇళ్ళకే పరిమితమైన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలింపులు ఇవ్వడంతో ఉత్సాహంగా రోడ్లపైకి వస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో ఈ ఉత్సహం మరింతగా కనిపిస్తోంది. సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వడంతో ఉద్యోగులు, కార్మికులు తమ విధులకు వెళ్తున్నారు. నగరంలో సాధారణ పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. అన్ని దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 19, 2020 / 12:18 PM IST
    Follow us on

    కరోనా భయంతో లాక్ డౌన్ కారణంగా 55 రోజులుగా ఇళ్ళకే పరిమితమైన ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలింపులు ఇవ్వడంతో ఉత్సాహంగా రోడ్లపైకి వస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో ఈ ఉత్సహం మరింతగా కనిపిస్తోంది. సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వడంతో ఉద్యోగులు, కార్మికులు తమ విధులకు వెళ్తున్నారు. నగరంలో సాధారణ పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. అన్ని దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్‌ తో శుభ్రం చేసుకుంటున్నారు.

    ఇక దుకాణాలకు సరి – బేసి విధానంలో అనుమతివ్వడంతో.. తమ దుకాణాలను శుభ్రం చేసుకునే పనిలో యజమానులు బిజీ అయిపోయారు. కంటైన్‌ మెంట్‌ జోన్లలో తప్ప అన్ని ప్రాంతాల్లో యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వాణిజ్యపరమైన ఏరియాల్లో దుకాణాల యజమానులు, ఉద్యోగులతో సందడి నెలకొంది. ఉదయం 9 గంటలకే తమ విధుల్లో చేరిపోయారు. సికింద్రాబాద్‌, కోఠి ఏరియాల్లో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ జీవనోపాధికి బాటలు వేసుకుంటున్నారు.