పది పరీక్షలకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటివారం తర్వాత టెన్త్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటికీ కేసుల తీవ్రత పెరిగితే.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు  వెల్లడించింది. ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం జూలైలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. కరోనా తీవ్రతను బట్టి షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. […]

Written By: Neelambaram, Updated On : May 19, 2020 1:04 pm
Follow us on

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటివారం తర్వాత టెన్త్‌ పరీక్షలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. జూన్‌ 3న పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అప్పటికీ కేసుల తీవ్రత పెరిగితే.. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు  వెల్లడించింది.

ఇదిలా ఉంటే ఏపీలో మాత్రం జూలైలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. కరోనా తీవ్రతను బట్టి షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఎగ్జామ్స్  కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తెలంగాణ హైకోర్టు గుడ్‌ న్యూస్ చెప్పింది. వచ్చే నెలలోనే పరీక్షలు నిర్వహించాలని పచ్చజెండా ఊపింది.