https://oktelugu.com/

పింఛన్‌ పెంచుకుంటూ పోవుడే..! : ఎన్నిరోజులకో క్లారిటీ అయితే లేదు

ఏ ఎన్నికల్లో అయినా కొన్ని వర్గాలనే టార్గెట్‌ చేసి వారికి పార్టీలు తాయిలాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఆ తాయిలాలను విన్న ప్రజలు ఎవరో ఒకరికి పట్టం కడుతుంటారు. సరిగా 20 నెలల క్రితం ఏపీలో కూడా అదే జరిగింది. జగన్‌ ముఖ్యంగా వృద్ధులను టార్గెట్‌ చేసి పెన్షన్‌ రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పారు. దీంతో పెన్షనర్లు అంతా ఓట్ల వర్షం కురిపించారు. అయితే.. 2019 మేలో అధికారం చేపట్టిన జగన్.. రూ.250 మాత్రమే పెంచారు. అప్పుడే […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 27, 2021 2:21 pm
    Follow us on

    Jagan
    ఏ ఎన్నికల్లో అయినా కొన్ని వర్గాలనే టార్గెట్‌ చేసి వారికి పార్టీలు తాయిలాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఆ తాయిలాలను విన్న ప్రజలు ఎవరో ఒకరికి పట్టం కడుతుంటారు. సరిగా 20 నెలల క్రితం ఏపీలో కూడా అదే జరిగింది. జగన్‌ ముఖ్యంగా వృద్ధులను టార్గెట్‌ చేసి పెన్షన్‌ రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పారు. దీంతో పెన్షనర్లు అంతా ఓట్ల వర్షం కురిపించారు. అయితే.. 2019 మేలో అధికారం చేపట్టిన జగన్.. రూ.250 మాత్రమే పెంచారు. అప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఒకేసారి రూ.మూడు వేలు చేస్తాననలేదని.. పెంచుకుంటూ పోతానని చెప్పానన్నారు.

    Also Read: మార్పు మొదలైందంటున్న పవన్.. సంతోషానికి కారణమేంటి?

    ఏడాదికో రూ.250 పెంచుతామని చెప్పుకొచ్చారు. అయితే.. రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ మరోసారి పెంచలేదు. ఈ సంవత్సరం బడ్జెట్‌లోనూ పెంపు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది జనవరిలో పెంచుతామని సంక్షేమ క్యాలెండర్‌లో పేర్కొన్నారు. దీంతో పెన్షనర్లు అవాక్కవాల్సి వస్తోంది. ఇటీవల సీఎం జగన్ కేబినెట్ భేటీలో సంక్షేమ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. పథకాలకు ఏయే నెలలో నగదు బదిలీ చేస్తారో అందులో వివరించారు.

    పెన్షన్ పెంపు గురించి.. వచ్చే ఏడాది జనవరి మాసంలో ప్రతిపాదించారు. దాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. రూ.250 పెంచడానికి రెండున్నరేళ్ల సమయం తీసుకోవడమే దీనికి కారణం. ఇప్పటికే పెన్షన్ పెంపు అంశంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఏటా రూ.250 పెంచుతామన్న ప్రభుత్వం .. పెన్షనర్లను మోసం చేస్తోందని మండి పడుతున్నారు. నిజానికి వైఎస్ఆర్ వర్ధంతికి.. జయంతికి పలుమార్లు పెంపు ప్రకటనలు కూడా వచ్చాయి. కానీ ప్రభుత్వం అమలుకు వచ్చే సరికి వెనుకడుగు వేసింది.

    Also Read: ఆ సీటుపై కేసీఆర్‌‌లో పెరుగుతున్న టెన్షన్‌

    దాదాపుగా 50 మంది వరకూ ఉన్న వృద్ధాప్య.. ఇతర సామాజిక పెన్షనర్లు పెద్ద ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. చంద్రబాబు హయాంలో రూ.200 ఉండే పెన్షన్‌ను రూ.వెయ్యి చేశారు. ఆ తర్వాత ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ.రెండు వేలు చేశారు. దీంతో సీఎం జగన్ తాను రూ.మూడు వేలు ఇస్తానని ప్రకటించారు. పెంచుకుంటూ పోతానన్నారు. దీంతో ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. ప్రమాణ స్వీకారం రోజున రూ.250 మాత్రమే పెంచడంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు.. అదే మొత్తం రెండున్నరేళ్లు కొనసాగుతుండటంతో మరింత ఆవేదన చెందే పరిస్థితి కనిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్