https://oktelugu.com/

పెగాసస్ వ్యవహారం.. బండారం బయటపడెన

పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. పార్లమెంట్ నుసైతం కుదిపేసింది. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసే విధానాన్ని మానుకోవాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎస్ వో సంస్థ అన్ని దేశాలకు తమ సాఫ్ట్ వేర్ ను అందజేసింది. దీంతో ఎవరి ఫోన్లయినా ట్యాపింగ్ చేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎస్ఎస్ వో (సైబర్ సెక్యూరిటీ సంస్థ) అనేక దేశాలకు సాఫ్ట్ వేర్ ను అందించింది. ఆ సాఫ్ట్ వేర్ ను […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 2, 2021 / 01:28 PM IST
    Follow us on

    పెగాసస్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. పార్లమెంట్ నుసైతం కుదిపేసింది. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసే విధానాన్ని మానుకోవాలని ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎస్ఎస్ వో సంస్థ అన్ని దేశాలకు తమ సాఫ్ట్ వేర్ ను అందజేసింది. దీంతో ఎవరి ఫోన్లయినా ట్యాపింగ్ చేసే అవకాశం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎస్ఎస్ వో (సైబర్ సెక్యూరిటీ సంస్థ) అనేక దేశాలకు సాఫ్ట్ వేర్ ను అందించింది. ఆ సాఫ్ట్ వేర్ ను ఆయా దేశాలు దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు నమోదు కావడంతో తమ సాఫ్ట్ వేర్ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.

    ప్రపంచంలో ఇజ్రాయెల్ ఇంటిలిజెన్స్ సామర్థ్యం గురించి అందరికి తెలుసు. దేశ ద్రోహులు, సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం ఎస్ఎస్ వో సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసింది. అయితే వివిధ దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ సాఫ్ట్ వేర్ ను ప్రముఖ సంస్థలపై నిఘా వేసేందుకు ఉపయోగించింది. దీంతో సాధారణంగానే అభియోగాలు వచ్చాయి. దీంతో సదరు ఎస్ఎస్ వో తన సేవలను నిలిపివేసింది.

    పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ఇంటిలిజెన్స్, మిలిటరీ, నిఘా సంస్థలు మాత్రమే వాడుతున్నాయి. కానీ మన దేశంలో ప్రతిపక్ష నేతలు, పారిశ్రామిక వేత్తలు, జడ్జీలు, శాస్ర్తవేత్తలు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వారి ఫోన్లు ట్యాపింగ్ చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెగాసస్ వ్యవహారం బయటపడటంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. గడిచిన రెండు వారాలుగా ఫోన్ ట్యాపింగ్ పై పార్లమెంట్ లో గందరగోళం నెలకొంది.

    కేంద్రంపై అనేక సంస్థలు ఫిర్యాదు చేయడంతో సుప్రీంకోర్టు తో విచారణ చేయించేందుకు సైతం సిద్ధమయ్యాయి. కేంద్రం పెగాసస్ వాడకంతో అందరిని ఇబ్బందులకు గురి చేస్తోందని అందరు ముక్తకంఠంతో ఎదురు తిరగడంతో ఎస్ఎస్ వో సంస్థపై ఒత్తిడి పెరుగుతోంది. తమ సాఫ్ట్ వేర్ దుర్వినియోగం అవుతుందని తెలియడంతో పెగాసస్ సేవలను యాజమాన్యం నిలిపివేసింది. తొందరలోనే ఇండియాలో కూడా సేవలు నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.