https://oktelugu.com/

పెగాసస్ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేస్తుంది. ప్రతిపక్షాలు దీనిపై చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. దీంతో పెగాసస్ పిటిషన్లపై వచ్చే గురువారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం దీని విచారణ చేపట్టనున్నారు. దీనిపై సుప్రీంకోర్టు లో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రత్యేక ధర్మాసనం దర్యాప్తు కోరుతూ ఎన్. రామ్, శశికుమార్ పిటిషన్ వేయగా న్యాయవాది ఎమ్.ఎల్. శర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. సీపీఎం […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 2, 2021 / 10:01 AM IST
    Follow us on

    పెగాసస్ వ్యవహారం పార్లమెంట్ ను కుదిపేస్తుంది. ప్రతిపక్షాలు దీనిపై చర్చ జరగాలని పట్టుబడుతున్నాయి. దీంతో పెగాసస్ పిటిషన్లపై వచ్చే గురువారం విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం దీని విచారణ చేపట్టనున్నారు. దీనిపై సుప్రీంకోర్టు లో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రత్యేక ధర్మాసనం దర్యాప్తు కోరుతూ ఎన్. రామ్, శశికుమార్ పిటిషన్ వేయగా న్యాయవాది ఎమ్.ఎల్. శర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు.

    సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ మరో పిటిషన్ వేశారు. పెగాసస్ కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని కోరుతూ వేసిన పిటిషన్లపై వచ్చే వారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి రమణ సూచించారు. ఇజ్రాయెల్ స్పైవేర్ ను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లు ప్రధాన ఆరోపణ. ఫోన్ల సంభాషణలపై నిఘా పెట్టాలని వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి లేదా మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని కోరారు. ఫోన్ల ట్యాపింగ్ పై ప్రతిపక్షాలు పార్లమెంట్ వేదికగా కోడై కూశాయి.

    ప్రభుత్వ నిర్వాకంతో తమ ప్రైవసీ మంట గలుస్తుందని ఆరోపించాయి. దీంతో పెగాసస్ వ్యవహారంపై ఎట్టకేలకు విచారణ చేపట్టనున్నారు. ప్రముఖ పాత్రికేయులు ఎన్. రామ్, శశికుమార్ సత్వరమే విచారణ జరపాలని గత శుక్రవారం వాదనలు చేస్తూ కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ పని భారాన్ని పరిగణనలోకి తీసుకుని వచ్చే వారం విచారణ జాబితాలో చేరుస్తామని సూచించారు.

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఈమేరకు అన్ని పిటిషన్లను వచ్చే గురువారం విచారణ జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్వేచ్ఛ, స్వాతంత్రాలపై తీవ్ర ప్రభావం చూపే ఇలాంటి అంశంపై సత్వరమే విచారణ జరపాలని కోరారు. న్యాయవాది కపిల్ సిబాల్ నిఘా పెట్టేందుకు లక్ష్యంగా రాహుల్ గాంధీతో సహా దేశంలో 142 మందికి పైగా ప్రముఖులను ఎంపిక చేసుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థల సంయుక్త పరిశోధనలో వెల్లడైనట్లు పిటిషనర్లు పేర్కొన్నారు.