ప్చ్.. ఎన్టీఆర్ తో, పవన్ తో ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో !

మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మరో సినిమాకి షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్, ఆచార్యను మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఎలాగూ ఆచార్య ఫినిష్ అవుతుంది కాబట్టి, లిస్ట్ లో మరో సినిమా చేరితే బాగుంటుంది అని ఫీల్ అయిన చిరు, దర్శకుడు బాబీ సినిమాకి గ్రీన్ […]

Written By: admin, Updated On : August 2, 2021 9:53 am
Follow us on

మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా మరో సినిమాకి షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఆచార్య సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్, ఆచార్యను మరో రెండు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఎలాగూ ఆచార్య ఫినిష్ అవుతుంది కాబట్టి,

లిస్ట్ లో మరో సినిమా చేరితే బాగుంటుంది అని ఫీల్ అయిన చిరు, దర్శకుడు బాబీ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసలు చిరంజీవి, బాబీ దర్శకత్వంలో సినిమా చేయడం ఏమిటి ? అంటూ షాక్ అవుతున్నారు నెటిజన్లు. బాబీ స్టార్ డైరెక్టర్ కాదు, అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు కూడా లేదు. మరి అలాంటప్పుడు మెగాస్టార్ ఎందుకు బాబీకి ఛాన్స్ ఇచ్చినట్టు ? ఒకవేళ అతను చెప్పిన కథ బాగా నచ్చితే.. కథ వరకు తీసుకోవచ్చు కదా !

నిజానికి చిరు – బాబీ చిత్రాన్ని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఏది ఏమైనా పెద్దగా హిట్స్ లేకుండానే బాబీ మొదటి నుండి భారీ ఛాన్స్ లు పట్టేస్తున్నాడు. లేకపోతే ఎన్టీఆర్ తో, పవన్ కళ్యాణ్ తో కూడా సినిమాలు చేయడం ఏమిటి ? ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తో సినిమాకి రెడీ అవడం ఏమిటి ?

మొత్తానికి బాబీలో ఏదో ఆకర్షణ ఉన్నట్టు ఉంది. స్టార్ హీరోలను ఒప్పించి సినిమాలు చేస్తున్నాడు అంటే.. ఎంతైనా గ్రేటే లేండి. ఇక దసరా నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ లోపు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మెగాస్టార్ లూసిఫెర్ రీమేక్ ను పూర్తి చేస్తారట. వచ్చే వారం నుండి చిరు ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు.