ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వరుస సంచలనాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్కారు.. ఎస్ఈసీ మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమంటోంది. రోజురోజుకు ఘర్షణ వాతావరణం పెరిగిపోతోంది. జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే.. ఎస్ఈసీ అందుకు వ్యతిరేకంగా వెంటనే మరో బాణం సందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య సంది కుదరడం లేదు.
Also Read: ఇంటింటికి బియ్యం.. జగన్ కు కొత్త కష్టం
ఈ నేపథ్యంలో నమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈనెల 21 వరకు ఇంటికే పరిమితం చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఆదేశించారు. ఇటీవల నిమ్మగడ్డపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు ఓటుహక్కు నమోదు చేసుకోవడం కూడా తెలియని వ్యక్తి ఎస్ఈసీగా ఉండడం ఏంటని ఆయన ఘాటుగానే ప్రశ్నలు సంధించారు. తాజాగా పెద్దిరెడ్డి సొంతజిల్లా చిత్తూరుతో పాటు గుంటూరు జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీల విషయమై వివాదం నెలకొంది. ఈ జిల్లాల్లో ఎక్కువ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయనే కారణంతో వాటిని ప్రకటించకుండా… విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత జిల్లా అధికారులను ఎస్ఈసీ ఆదేశించారు.
Also Read: పంచాయతీ తర్వాత పరిషత్..: రంగులు పునరుద్ధరించొద్దు
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ ఆదేశాలపై మంత్రి పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా వ్యవహరిస్తున్న నమ్మగడ్డ రమేశ్ కుమార్ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరంచే అధికారులను .. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు బ్లాక్ లిస్టులో పెడతాం.. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి.. 31 తరువాత గుణపాఠం నేర్పుతామని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఘాటుగానే విమర్శించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఈనేపథ్యంలో పెద్దరెడ్డిని కట్టడి చేసేందుకు ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ.. పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని డీజీపీని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. అదే విధంగా మీడియాతో కూడా మాట్లాడకుంటా కట్టడి చేయాలని సూచించారు. ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ఈ చర్యను తీసుకుంటున్నట్లు ఎస్ఈసీ వెల్లడించారు. అలాగే ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై పెద్దిరెడ్డి కౌంటర్ ఏవిధంగా ఉంటుందో చూడాలి మరి..?