జగన్ చేతికి చిక్కిన ‘నిమ్మగడ్డ’

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ , ఏపీ సీఎం జగన్ మధ్య యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. ప్రతీసారి వైసీపీ నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఇస్తూ.. వచ్చిన నిమ్మగడ్డ రమేశ్ కుమారుకు తొలిసారి భంగపాటు ఎదురైంది. ఈనెల 9వ తేదీ వరకు నిమ్మగడ్డ తయారు చేయించిన ఈ వాచ్ యాప్ ను వాడేందుకు వీలు లేదని కోర్టు తేల్చి చెప్పిందనన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఇక్కడే ఇప్పడు ఓ సరికొత్త ట్విస్టు ఏర్పడింది. యాప్ తయారు చేయించింది […]

Written By: Srinivas, Updated On : February 6, 2021 3:07 pm
Follow us on


నిమ్మగడ్డ రమేశ్ కుమార్ , ఏపీ సీఎం జగన్ మధ్య యుద్ధం రోజురోజుకు పెరుగుతోంది. ప్రతీసారి వైసీపీ నాయకుల వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ ఇస్తూ.. వచ్చిన నిమ్మగడ్డ రమేశ్ కుమారుకు తొలిసారి భంగపాటు ఎదురైంది. ఈనెల 9వ తేదీ వరకు నిమ్మగడ్డ తయారు చేయించిన ఈ వాచ్ యాప్ ను వాడేందుకు వీలు లేదని కోర్టు తేల్చి చెప్పిందనన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఇక్కడే ఇప్పడు ఓ సరికొత్త ట్విస్టు ఏర్పడింది. యాప్ తయారు చేయించింది నిమ్మగడ్డ అయినా.. ఇప్పడు అది జగన్ చేతికి చిక్కింది. ఇప్పడు సీఎం కనుసైగల ఆధారంగా యాప్ విడుదల అవుతుంది. లేకుంటే.. అది బయటకు వచ్చే అవకాశమే లేదు.

Also Read: బాబు పెద్ద స్కెచ్చే వేస్తున్నారుగా..!

ఈ వాచ్ యాప్ కు సెక్యూరిటీ సర్టిఫికెట్ తప్పనిసరి అని కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో వ్యవహారం మొత్తం మెలిక పడింది. ఏపీ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ దీనికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సదరు సంస్థ అనుమతి ఇస్తుందని చెప్పలేం. ఒకవేళ ఇచ్చినా.. సెక్యూరిటీ పరంగా మరింత మెరుగు పరచాలని ఓ పొగేస్తే.. చాలు.. నిమ్మగడ్డ దిగిపోయినా.. యాప్ కు దిక్కూ.. మొక్కూ.. ఉండదిక. వాస్తవంగా యాపుకు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఐదురోజుల సమయం పడుతుంది. ఈనెల 4న సర్టిఫికెట్ కోసం ఈసీ నుంచి దరఖాస్తు వెళ్లింది. అంటే 9వ తేదీ వరకు అనుమతి రాదు. ఆ తరువాత అనుమతి ఇవ్వాలా లేదా అన్నది ఏపీటీఎస్ సంస్థ ఇష్టం. అందుకే ఇప్పుపు నిమ్మగడ్డ తెగ టెన్షన్ పడిపోతున్నారు. కోర్టులో దెబ్బ తగలడం ఒక కారణం అయితే.. తన జుట్టు జగన్ చేతిలో చిక్కడం మరో కారణం అయిపోయింది.

Also Read: అతన్ని హౌస్ అరెస్ట్ చేయండి.. ఏపీ డీజీపీ సవాంగ్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం.

ఇక ఎస్ఈసీ సొంతంగా ప్రయివేటు యాప్ తీసుకురావడంపై కోర్టులో మూడు ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వం రూపొందించిన యాప్ ను ఎందుకు ఉపయోగించడం లేదంటూ.. కోర్టు నిమ్మగడ్డ తరఫు లాయర్ ను ప్రశ్నించింది. ప్రభుత్వ యాప్ లపై ఆధార పడకుండా.. సొంతంగా యాప్ రూపొందించుకునేలా.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రోత్సహించిందని తలతిక్క సమాధానం ఇచ్చారు లాయర్.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఆరేడు మాసాల నుంచి ఈ యాపు పై కసరత్తు చేస్తున్నట్లు కూడా వివరించారు. ఈ మేరకు కేంద్ర పభుత్వం, భారత ఎన్నికల కమిషన్ తో ఎస్ఈసీ జరిపిన సంప్రదింపుల వివరాలు కూడా సీల్డు కవరులో పెట్టి కోర్టు ముందు ఉంచుతామని చెప్పగా.. ధర్మాసనం అందుకు నిరాకరించినట్లు సమాచారం. మొత్తం మీద యాప్ తో హడావుడి చేద్దామనుకున్న నిమ్మగడ్డ ప్లాన్ కు కోర్టు బ్రేక్ వేసింది. అదే సమయంలో అసలు యాపు కే అనుమతి లేకుండా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కే భారీ షాక్ ఇవ్వనుంది జగన్ ప్రభుత్వం.