రేవంత్ రెడ్డి దూకుడు

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉత్సాహంతో పని చేస్తున్నారు. అందరిని కలుపుకుని పోతూ నిత్యం ర్యాలీలు, ధర్నాలు, విమర్శలు, దీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ఆరంభించిన రేవంత్ కొడంగల్ నుంచి 2009, 2014లో ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2017లో కాంగ్రెస్ లో […]

Written By: Srinivas, Updated On : July 19, 2021 10:28 am
Follow us on

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉత్సాహంతో పని చేస్తున్నారు. అందరిని కలుపుకుని పోతూ నిత్యం ర్యాలీలు, ధర్నాలు, విమర్శలు, దీక్షలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితాన్ని ఆరంభించిన రేవంత్ కొడంగల్ నుంచి 2009, 2014లో ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2017లో కాంగ్రెస్ లో చేరి 2018లో ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో మల్కాజిగిరి ఎంపీగా విజయం సాధించారు.

అధికార పార్టీ కార్యక్రమాలపై నిత్యం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతున్న క్రమంలో పార్టీని గట్టెక్కించే పనిలో భాగంగా అందరిని కలుపుకుని పార్టీని గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా నిరంతరం శ్రమిస్తున్నారు. రేవంత్ కు బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి సీనియర్లు గుర్రుగా ఉండడంతో వారిని సైతం తమ వైపు తిప్పుకునేందుక తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ర్టంలో వాతమొచ్చిన చేతికి ఊతం దొరికిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పెట్రోధరల పెరుగుదల, రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. డైనమిక్ లీడర్ గా అభిమానుల్లో గుర్తింపు పొందిన రేవంత్ ఇప్పుడు అదో జోరుతో కొనసాగుతున్నారు. తాజాగా ప్రభుత్వ భూములను వేలం వేయడంలో అధికార పార్టీ వెయ్యి కోట్ల కుంభకోణానికి పాల్పడిందిన సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై స్పందించి భూముల వేలం రద్దు చేసి స్విస్ విధానంలో మళ్లీ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోతే కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ పైన విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయనపై హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉంన్న కేసులను విచారించాలని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చట్టపరంగా పోరాటం చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. మరోవైపు నిరుద్యోగ సమస్యపై పోరాడేందుకు 48 గంటల నిరాహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రజాసమస్యలపై పోరాడుతూనే టీఆర్ఎస్ ను ఓడించే దిశగా పావులు కదుపుతున్నారు.