https://oktelugu.com/

మరో కొత్త పథకం.. కేసీఆర్ హుజురాబాద్ స్కెచ్

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభం చేస్తోంది. హుజురాబాద్ కేంద్రంగా ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా దళితుల సాధికారత కోసం ప్రారంభించిన దళిత బంధు నియోజకవర్గం నుంచే ప్రారంభించేందుకు సంకల్పించింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనే క్రమంలో తన వైఖరి తేటతెల్లం చేస్తోంది. ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సెంటిమెంట్ గా […]

Written By: , Updated On : July 19, 2021 / 10:19 AM IST
Follow us on

KCR Dalita Banduహుజురాబాద్ ఉప ఎన్నిక కోసం అధికార పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ప్రారంభం చేస్తోంది. హుజురాబాద్ కేంద్రంగా ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా దళితుల సాధికారత కోసం ప్రారంభించిన దళిత బంధు నియోజకవర్గం నుంచే ప్రారంభించేందుకు సంకల్పించింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనే క్రమంలో తన వైఖరి తేటతెల్లం చేస్తోంది.

ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సెంటిమెంట్ గా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించడం ఆనవాయితీగాపెట్టుకున్నారు. గతంలో సింహగర్జన సభ, రైతుబంధు లాంటి వాటిని ఇక్కడి నుంచే మొదలుపెట్టిన కేసీఆర్ దళిత బంధును కూడా ఇక్కడి నుంచే ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో హుజురాబాద్ లేదా కమలాపూర్ మండలంలో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. దీనికి కసరత్తు పూర్తి చేశారు.

దళితబంధు పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ ను ఎంచుకున్నారు. రాష్ర్టంలో దళితుల సమగ్రాభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. దళితల ఆత్మగౌరవనాన్ని పెంచే విధంగా దళిత బంధు ఉంటుందని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో దళితులను గుర్తించి వారి కోసం కేటాయించిన నిధులతో వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచేందుకు ప్రభుత్వం సాయం చేస్తుంది. దీంతో వారి జీవితంలో మార్పు వచ్చేందుకు ఈ పథకం తోడ్పడుతుంది.

హుజురాబాద్ ఉప ఎన్నికపై అధికార పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే దళిత బంధు పథకాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. బీజేపీ సైతం తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈటల రాజేందర్ సతీమణి జమున బీజేపీ తరఫున ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తూ బీజేపీని ఆదరించాలని కోరుతున్నారు. అభ్యర్థి ఎవరైనా ఓటు మాత్రం బీజేపీకే వేయాలని ప్రార్థిస్తున్నారు. కానీ అభ్యర్థుల ఎంపిక మాత్రం ఇప్పటికి ఏ పార్టీ కూడా ప్రకటించలేదు. ఒక బీజేపీనే తన ప్రచారం ముమ్మరం చేస్తోంది.