Pawan vs Jagan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టేందుకు భీమ్లా నాయక్ గా వచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అన్ని చోట్ల ‘భీమ్లా’ మేనియా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలయికలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భీమ్లా నాయక్’. ఈ మలయాళ రిమేక్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 25న థియేటర్లలోకి వచ్చింది. ఉదయం నుంచే బెనిఫిట్ షోస్ మొదలుకావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
రాజకీయం కోణంలో పవన్ కళ్యాణ్ ను దెబ్బ తీసేందుకు ఏపీ సీఎం జగన్ సినిమా ఇండస్త్రీపై కక్ష గట్టాడనే ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి సమావేశంలో తెలుగు సినీ పరిశ్రమకు రాయితీలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పడు పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాను ఏపీలో అణిచివేస్తున్నారని పరిణామాలను బట్టి ఆయన ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. భీమ్లానాయక్ మూవీ టికెట్స్ అధిక రేట్లకు టికెట్లు విక్రయించినా, బెనిఫిట్ షోస్ వేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఏపీలో అదనపు షోస్ , బెనిఫిట్ షోస్ లేకపోయినప్పటికీ అభిమానుల కోలాహలం మాత్రం తగ్గలేదు. జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని, సమయం వచ్చినప్పుడు అన్ని బదులు తీరుస్తాం అంటున్నారు అభిమానులు.
ఏ సినిమాపై ఏపీ సీఎం దెబ్బ కొట్టాడో అదే సినిమా ద్వారా పవర్ స్టార్ పవన్ కల్యాన్ జగన్ ను టార్గెట్ చేశాడు. రాజకీయంగా తనపై అనేక దాడులు చేయిస్తున్న జగన్ పై పవన్ కల్యాన్ తన సినిమాలో కొన్ని సన్నివేశాల ద్వారా అదే తరహాలో టీజ్ చేశాడని సినిమా చూసిన ప్రేక్షకులు కోడైకూస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో తన స్వభావమేంటో తెరపై చూపించాడు పవర్ స్టార్. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లోని మాటలు తెరపై హీరోయిజం ఎలివేట్ చేయడంతో పాటు పవన్ రాజకీయ భవిష్యత్తును ఆవిష్కరించారని అంటున్నారు. ‘‘ప్రతి శుక్రవారం స్టేషన్ కు రావడం, సంతకం పెట్టడం ఖర్చు ఎక్కువవుతుంది. డబ్బు వేస్ట్ అవుతుంది’’ అని రావు రమేశ్ అనే క్యారెక్టర్ ద్వారా చెప్పించడం జగన్ కోసమే ఈ సన్నివేశం పెట్టినట్లుగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇదే సన్నివేశంలో పవన్ కల్యాణ్ ‘సరే రిజిస్టర్ పంపిస్తా.. తీరిగ్గా సంతకాలు పెట్టి పంపించు’ అని చెప్పడం.. ‘ఇంకా శ్రమ తగ్గాలనుకుంటే అదీ కూడా అవసరం లేదు. కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ పంపిస్తా. తీరిగ్గా జైల్లో ఉండచ్చు’ అని చెప్పడం జగన్ ను టీజ్ చేయడానికే పెట్టినట్లుగా ఉందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ సీఎంగా ఉన్న జగన్ ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే దాన్నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ వేసిన పిటిషన్ ను జడ్జి తిరస్కరించిన సందర్భాన్ని ఇది గుర్తుకు తెస్తున్నది. ‘యుద్ధంలో 17 సార్లు ఓడిపోయిన గజినీ మహ్మద్ గుర్తున్నాడు.. కానీ గెలిచినోడు గుర్తు లేడు. నేనూ అంతే ఎన్నిసార్లు ఒడిపోయినా గెలిచే వరకూ పోరాడుతూనే ఉంటా.. నన్ను ఎంత తొక్కితే అంత పైకి లేస్త.. పడిపోతే మళ్లీ నిలబడతా’ లాంటి డైలాగులు అభిమానులను ఎంత అలరిస్తున్నాయో ఏపీ సీఎం జగన్ కు అంతే సవాల్ విసిరినట్లుగా ఉంది. రావు రమేశ్ డైలాగులు పూర్తిగా జగన్ పొల్చుతూ చెప్పించినట్లుగానే ఉన్నాయి. ఇక తెర మీద ఏపీలో పనిచేసే ఎస్ఐ పాత్రలో పవన్ కల్యాణ్.. తన ప్రత్యర్థి రానా ను తెలంగాణ కు చెందిన వ్యక్తిగా చూపిస్తూ సీఎం జగన్ ను తీసి పారేసినట్లుగా కనిపిస్తుంది.
అయితే సినిమా పూర్తి ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమాలోని కొన్ని సంభాషణలు, పాత్రల స్వభావం ఏపీ సీఎం జగన్ ను పొల్చి చూయించినట్లుగా ఉందనే టాక్ వినిపిస్తున్నది. ఈ సన్నివేశాలపై జగన్ అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.. ఏపీలో ఎన్ని ఆంక్షలు విధించినా అఖండ సినిమాతో బాలకృష్ణ అలవోకగా అధిగమించేశాడు… అంతే తప్ప వెనకడుగు వేయలేదు. ఇక భీమ్లానాయక్ కు ఏపీ మినహా మిగతా అన్ని చోట్ల మంచి రెస్పాన్సే వస్తున్నది. మొదటి రోజులు మాత్రం పవర్ స్టార్ సినిమా కి కలెక్షన్ల పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.
-శెనార్తి
Recommended Video: